సత్య వచనా లండోయి

సత్య వచనా లండోయి


*సత్య వచనాలోయి*


*మిత్రమా!*

మంచి మనసుతో రోజు మొదలు కావాలోయి
అది పది మందికి ఉపయోగ పడాలోయి
పనికి రాని ఆలోచన దూరం చేయి
అక్కర లేని వస్తువులని బయట పారేయి

పరుల సొమ్ముని ఆశించకోయి
అదే అదే నీకు ప్రమాదం సుమండోయి

జీవితం చాలా విచిత్రమోయి
ఎవరి కోసం ఆగదండోయి
నీకు నువ్వే తెలుసుకోవాలోయి

డబ్బుతో ప్రపంచాన్ని మరవకోయి
మార్చలేని గతం గూర్చి ఆలోచించకోయి

అవసరాన్ని బట్టి మనుషలండోయి
రూపాయి లేకపోతే దరిచేరరోయి

ఆలోచించి నిర్ణయం తీసుకోవోయి
అపుడే మనసుకి హాయండోయి

చూసిందే నిజమని భ్రమపడకోయి
సమస్యలను తెలివిగా పరిష్కరించవోయి

నువు గెలిచే వరకూ శ్రమించవోయి
ముందు నిన్ను నీవు గెలవాలోయి

ఇవే ఇవే సత్య
 వచనాలండోయి

*******************


పేరు : 
*దొడ్డపనేని శ్రీ విద్య*
విజయవాడ
14/11/2021
ఆదివారం

0/Post a Comment/Comments