మరచి పోకు నేస్తమా
మారునని తలరాత
చిత్రమైన సృష్టి యిది
ప్రయత్నించు మారు భవిత
కలకాలం ఒక్క తీరను మాట వీడి
ముందు కేగు నిలుప చరిత
మట్టిలోన పుట్టానని
ఒంటరై మిడకక
వెతుకందునే దాగుండు
సకల సంపదలు చిక్కక
చూసే కన్నులను బట్టి
జనియించును తుది ఫలితం
ఎండమావి ఎడారుల
ఎదలలోన ఫలమున్నది
ప్రయత్నించి చూడు ముందు
ప్రకాశించె సిరి యున్నది
చింత వీడి చెంత చేరు
శోధించగా ఫలితంబు మెండు
ఒంటి నేదో కలతుంటె
మనసులో మంట పుడితే
అర్థమేమి నీ పుట్టుక
అంధకారమై చుడితే
నిప్పులాంటి నీ జ్ఞానం
కూసంలో కుదింపుటా
అవిటి వాడు సార్థ్ర
అవని యంత నిండెకదా
స్టీఫెన్ హాకింగ్ చరిత
చిరస్థాయి మిగల లేదా
ఏముంది అనుకుంటే
చరితలకు చోటు లేదు
అబ్దుల్ కలామైనా
అబ్రహం లింకనైనా
భుక్తి పాట్లు పడి నోళ్ళు
భూమేలినది చెరిగెనా
క్రుంగు బాటు విడిచి కదులు
వ్యూహాలన్ని నిచ్చెనలగు
చిన్న పక్షి రెక్క కెంత
విశాల విశ్వమంత
భయం వీడి బతుకు వెతుకు
చెదిరి పోవు అలసటంత
ఆలోచన పదును పెట్టు
అంతరాలు కూలేటట్టు.