" హంసమ్మ "
-------------------------
సరస్సులో హంసమ్మ
సరదాగా ఈదింది
చక్కని రూపంతో
హృదయాలు దోచింది
కలువమ్మల మధ్యలో
సంచారం చేసింది
అనువైన ప్రాంతంలో
కాపురమే పెట్టింది
తన తోటి హంసలతో
చలాకీగా మసలింది
సమైక్యత విలువను
అందరికీ చెప్పింది
తెల్లని కాయంతో
నిండు జాబిలైంది
మల్లెల నయనాలతో
అందాలు రువ్వింది
హింస పనులు వద్దంది
అహింసతో బ్రతుకుమంది
హంసమ్మ సందేశం
ఎల్లరికీ నచ్చింది
-గద్వాల సోమన్న