సుఖం చిగురిస్తుందా
ఈ క్షణం నిజం
మిగిలిన ఏ క్షణం మనదికాదు
రేపటితో సహా...
చూసేదే నిజం
మూసినదేది మనది కాదు
నిద్రతో సహా...
ఊపిరి నిజం
ఆడేదేది మనది కాదు
శ్వాసతో సహా...
ఆత్మ చైతన్యం నిజం
ఆగిపోయేదేది మనది కాదు
బూడిదయ్యే శరీరంతో సహా...
ఆచరణ నిజం
చెప్పేదేది మనది కాదు
పలికే మాటలతో సహా...
కానీ
వీడలేని మమకారం
బుద్దిలో బంధీఅయితే
కోరికల స్వార్దం
మనసులో నిండిపోతే
మనకు
సుఖం చిగురిస్తుందా
రచన
డా|| బాలాజీ దీక్షితులు పి.వి
తిరుపతి
8885391722