అక్క-మొక్క
-----------------------------------
అక్క మొక్క నాటింది
చక్కగ నీరు పోసింది
మిక్కిలిగా శ్రమించింది
మొక్క బాగా ఎదిగింది
మొక్క మొగ్గలేసింది
అక్క గంతులేసింది
పక్క వారితో చెప్పి
చుక్కలాగ నవ్వింది
పూలు మొక్క పూసింది
పరిమళాలు రువ్వింది
పరిసరాలు నింపింది
పలువురి మాది దోచింది
పట్టరాని సంతోషం
అక్క మోమున విరిసింది
--గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు.