అంశం:స్నేహమేరా జీవితం
శీర్షిక: మరువలేనిది నీ స్నేహం
తేనె కన్నా తీయనైనది నీ స్నేహం
మల్లెపూల కన్నా తెల్లనైనది నీ స్నేహం
మంచుకన్నా చల్లానైనది నీ స్నేహం
మరవలేనిది నీ స్నేహం
మరుపురానిది నీ స్నేహం
ఓ నవ్వుచాలు మొదలు నీ స్నేహం
రాగాలవీణ పాట మన స్నేహం
పారిజాతపుష్పసుగంధం నీ స్నేహం
మెరిసే ధ్రువనక్షత్రం మన స్నేహం
ప్రతిఫలాన్ని ఆశించనిదీ నీ స్నేహం
కష్టసుఖాల్లో తోడుండేది నీ స్నేహం
స్రుష్టిలో పవిత్రమైనది మన స్నేహం
వెలకట్టలేనిది మన ఇద్దరీ స్నేహం
వెన్నెల్లో వికసించేది మన స్నేహం
వసంతకాలంలో చిగురించే నీ స్నేహం
తీపి,గుర్తుల చిరకాల మన స్నేహం
అన్నిబంధాల్లో గొప్పబంధం స్నేహం
సూర్యచంద్రులవలే కలిసుండాలి మన స్నేహం.
హామిపత్రం: ఇది నా స్వంతంగా రాసినదని నా హామీ
పేరు:పసుల లాలయ్య (విద్యావాలంటీర్) గ్రామం: అనంతపూర్ మం:బొంరాస్పేట్ జిల్లా: వికారాబాద్ చరవాణి: 7893999525.