విలువైనది విద్య
----------------------------------
సాటిలేనిది విద్య
నేర్చుకుంటే విద్య
తొలగజేయును మిథ్య
ఓ వెన్నెలమ్మ !
విద్య గొప్ప ధననిధి
విద్య శ్రేష్ఠమైనది
నేర్చుకొనుట మన విధి
ఓ వెన్నెలమ్మ !
విద్య వలన ఉపాధి
జీవితాన ఉగాది
దీవెనలకు పునాది
ఓ వెన్నెలమ్మ!
విద్య ఉంటే జయము
దాని ద్వారా సుఖము
ముమ్మాటికీ నిజము
ఓ వెన్నెలమ్మ !
--గద్వాల సోమన్న