రైతు గోస
పంట చేలన్ని చెరవుల తలపించె
తడసిన వడ్లన్ని రోడ్ల పాలాయె
ఎప్పుడు ఎండుతాయో
ఎవడు కొంటాడో
తెల వదాయె.
పంట కుప్పలపైనే బతుకాయె.
ఇంటికి పోను దారి లేదాయె
ఒకడు రబీ అంటడు ,
మరొకడు తాబీ అంటడు,
ఇంకొకడు పంట మార్పిడి అంటడు.
కొనడమేమొ కల్లనే ఆయె
ఉమ్మడి ఆచరణ కరువాయె ,
వ్యవసాయ రంగం
రాజకీయంలో పావాయె ,
వడ్లకుప్పలు కదలవాయె
అప్పులేమొ తడసి మోపెడాయె ,
ఆస్తులన్ని కర్పూర హారతులాయె ,
శ్రమ జీవికి
కర్మ ఫలం ఎండమావాయె
కేంద్ర రాష్ట్రాల కొట్లాట
అర్థం కాకాపాయే
ఏడుపే మిగిలిపాయే
నా పిచ్చికకపోతే
రైతు ఓట్ల రాజకీయాల్లో
జోకర్ అయే
నేను సెలవు తీసుకుంటే
అప్పుడు తెలుస్తుంది మీకు
ఆ రోజు రానియకండి
నాయకులరా
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి