శీర్షిక : బాలలు -దేశపురోగతికి వారధులు.
నేటి బాలలు
రేపటి భావిభారత పౌరులు..
రేపటి ఆశలకు, ఆచరణలకు
నిలయాలు..
కల్మషంలేని మనసులు గల
కోవెలలో దివ్వెలు..
సాగిపోయే సాగర తరంగాలు...
మమతలు పంచే వెలుగుల దీపాలు...
ఆయుస్సును పెంచే ఆరోగ్య ఔషదాలు...
రేపటి సరిహద్దుల్లో కాపుకాసే దేశరక్షకులు.
ఇంటిళ్ళపాది తరతరాల వారసులు....
దేశభవితకు మార్గదర్శకులు.
నిత్యం విరభూసే నవఅల్లికల మాలికలు.
పాప పుణ్యం,మాయమర్మం ఎరుగని భువిని చేరిన భగవాన్ స్వరూపులు..
ప్రకృతిని తమలో నింపుకున్న బుసిబుసి నవ్వుల పూల మోములు...
బుడిబుడి అడుగుల భావిభారత పౌరులు.
రేపటి తరానికి వారధులు...
వారే దేశపురోగతి ఆధారాలు.
వి. కృష్ణవేణి
వాడపాలెం
తూర్పుగోదావరి జిల్లా.
9030226222.
ప్రక్రియ :వచనం