బాలా త్రిపుర సుందరి
పల్లవి
బాలలు రారండి.. రారండమ్మా రారండి
లలితమ్మ లాలిత్య రూపాలు మీరు.. నవరాత్రి దీపా లుమీరు.... దీపాలు మీరు
చరణం 1
వచ్చింది ...వచ్చింది శారద నవరాత్రి...
మనకు ఇచ్చింది మధుర ఉత్సవం ధరిత్రి....
ఆడుతూ గిలక తో వచ్చింది మా తల్లి త్రిపుర సుందరి.
2. రతనాల ఊయలలో ఊగుతూ వచ్చింది మా యమ్మ లలితాంబ.... వీణ పాణి యై స రాగాలను ఆలపిస్తూ వచ్చింది మా తల్లి వాగ్దేవి...
3. మూలా నక్షత్రాన పుస్తక పాణి యైపులకింప చేస్తూ వచ్చింది మా తల్లి సరస్వతమ్మ..
తపస్విని యై తదేకదీక్షతో వచ్చింది మా యమ్మ అపర్ణాంబ....
రక్త భీషుని వధించి విజయోత్సాహంతో సింహాన్ని అధిరోహించి వచ్చింది మా తల్లి మహంకాళి....
4. శంభునిశంభులు దునుమాడి ప్రజల భద్రతను కాపాడుతూ వచ్చింది భద్రకాళి
మహిషాసుర మర్దిని యై దానవుల పాలిట మృత్యువు యై రుద్ర దేవతగావచ్చింది మా తల్లి కాళికాంబ..
దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో అలసిన మాయమ్మ విజయదశమి నాడు విజయ ఢంకా సందడిచేయగా వెండి ఉయ్యాలలో బంగారు బాలయ్య వెలసింది మా ఊరి గడ్డపై త్రిపుర సుందరిగా
రా రండి రా రండి బాలల్లారా
గుడిలో దేవిని చూసొద్దాం పదండి....
పేరు :శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు: హైదరాబాద్
చరవాణి :9 4 9 0 2 3 9 5 8 1
బాలల గేయం నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను