సద్దుల బతుకమ్మ...! (గేయం) _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

సద్దుల బతుకమ్మ...! (గేయం) _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం



సద్దుల బతుకమ్మ...! (గేయం)
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం

పొద్దు పొద్దున లేసీ వలలో
కొమ్మలందరు గూడీ వలలో

తంగేడు కొమ్మల్లా వలలో
పూలు కోసుండ్రూ వలలో

గంతులు వేస్తున్నా వలలో
లేడి పిల్లావోలే వలలో

ఆడపడుచూలంతా వలలో
గునుగు పూలూ కోసీ వలలో

కన్నెలందరు గూడీ వలలో
కట్ల పూలూ కోసి వలలో

చెరువు చెరువులు తిరిగీ వలలో
చెట్ట పట్టాల్ పట్టీ వలలో

అన్నదమ్మూలంతా వలలో
తామరులూ కో సే వలలో

ముద్దు గుమ్మలు గూడీ వలలో
గుమ్మడి పూలూ కోసీ వలలో

అమ్మలక్కాలంతా  వలలో
బంతి పూలూ కోసి వలలో

చెక్క పీటా మీదా వలలో
తాంబాలము పెట్టీ వలలో

గుమ్మడాకులు  పరిచీ వలలో
తీరొక్క పూలాతో వలలో

బతుకమ్మను పేర్చీ వలలో
పసుపు గౌరమ్మనూ వలలో

భక్తితొ చేర్చేరూ వలలో
డప్పు దరువుల తోటీ వలలో

తెలంగాణ బిడ్డలంతా వలలో
బంగారు బతుకమ్మ లా వలలో

నెత్తి  నెత్తూ కోనీ వలలో
నదీ ప్రవాహ మోలే వలలో

ఏటి గట్టున చేర్చి వలలో
ఉయ్యాల పాటలతో వలలో

కోలాటం వేసీ వలలో
చప్పట్ల మోతలతో వలలో

సత్కారం చేసీ వలలో
ఆడపడుచూలంతా వలలో

పసుపు గౌరమ్మను తీసి వలలో
పోయిరా బతుకమ్మా వలలో

పోయిరా అంటునూ వలలో
సద్దుల బతుకమ్మనూ వలలో

సంతోషము తోడా వలలో
సాగనంపేరు వలలో....!

0/Post a Comment/Comments