పూల రే రాణి

పూల రే రాణి

పూలు .. రంగు రంగుల పూలు...అందమయిన పూలు. సృష్టి   లో  తన పూజ కోసం దేవుడు సృష్టించుకున్న పూలు.పసిపాప  బోసి నవ్వు ల పూలు. పూ లను చూస్తూ మయమరిచి పోయింది వెన్నెల.పూలు కోయటానికి తోట కొచ్చింది వెన్నెల.రోజంతా  పూలుతెంపితే  వచ్చేది వంద రూపాయలు.అమ్మ పూలు మాల కట్టి గుడిదగ్గర అమ్ముతుంది.ఇద్దరి కి.వచ్చిన డబ్బుతో ఆరుగురి మంది  తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.తండ్రి సంపాదన తాగుడికే సరిపోతుంది.తన చిన్న జీవితంలో ఎలాంటి కోరికలు తెలియని వెన్నెల...
తోటలో పూలు తెంపుతున్నంతసేపు... పూల లో ఒక పూవు లా మారిపోతుంది.తను కోసిన పూలు దేవుని మెడలో హారాలు అవుతాయి.పెళ్లి కి అలంకారములు
అవుతాయి. పూల అందం తో పోటీ పడుతుంది వెన్నెల అందం.పున్నమినాటి వెన్నె ల లా  వుంటుంది ఆమె మోము ఎపుడు.కల్లా కపటం తెలియని వెన్నెల పూల పిల్ల గా పిలబడుతుంది.తనకి ఆ పిలుపే ఎంతో ఆనందాన్ని యిస్తుంది. పూల కే రారాణి గా పొంగి  పోతుంది.పూ తో ట లో ప్రతి పువ్వు,మొగ్గ,ఆకు ఆమె నేస్తాలు. పూ ల   లో  వెన్నెలకు లక్ష్మి కనిపిస్తుంది. తోట కు రాగానే విరిసిన పూల తోట కు మొక్కు తుంది.ఏనాటికైనా ఎప్పటి కైనా పూ తోట లో పూవు గా పుట్టాలని ఆమె ఆలోచన.భగవంతుడు ఆమె అలోచన ఆలకి స్తాడేమో!
ఆమె కు పూలే బ్రతుక య్యాయి. బ్రతుకే పూలు అయ్యాయి.


0/Post a Comment/Comments