రజిత (కథ) ---ఎం.డి. రజియా, 10వ తరగతి, గోదావరిఖని.

రజిత (కథ) ---ఎం.డి. రజియా, 10వ తరగతి, గోదావరిఖని.

రజిత

అనగనగా ఒక ఊరిలో తిరుమల, గౌతమ్ అనే భార్య భర్తలు ఉండేవారు. వాళ్ళకి రజిత, నవ్య అనే కూతుర్లు ఉండే వాళ్ళు. రవి అనే కొడుకు కూడా  ఉండేవాడు. వాళ్ళ అమ్మ నాన్న కూలి పని చేసేవారు. ఈ ముగ్గురు పిల్లలు వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. రజితకు చదువు అంటే చాలా ఇష్టం. వీళ్ళ కుటుంబంతో వాళ్ళ  నానమ్మ కూడా ఉండేది. గౌతమ్ ఎప్పుడూ తాగుతూనే ఉండేవాడు. తన భార్యను ఎప్పుడూ కొట్టేవాడు. గౌతమ్ పనికి వెళ్లినా కూడా డబ్బు ఇంట్లో ఇచ్చేవాడుకాదు. పిల్లల్నికూడా సరిగ్గా చూసుకోడు. పిల్లలకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం  కానీ వాళ్ళ నాన్న వాళ్ళని ప్రేమగా చూసుకోడు. ఏమీ కొనివ్వడు. ఒక రోజు బాగా తాగి వచ్చి వాళ్ల అమ్మని కొట్టి పిల్లల్ని వదిలి వెళ్ళిపోయాడు. వేరే పెళ్లి చేసుకున్నాడు. తన అమ్మని పిల్లల్ని చూసుకుంటుంది. ఒక రోజు తిరుమలకు, గౌతమ్ వాళ్ళ అమ్మకు గొడవ అయ్యింది. దానితో వాళ్ళు మాట్లాడుకోరు. వారి పిల్లలలో రజిత 10వ తరగతి, నవ్య 6వ తరగతి, రవి 7వ తరగతి  పిల్లలకి కుటుంబంతో కలిసి మెలిసి ఉండడం చాలా ఇష్టం. కానీ వీళ్ళని పట్టించుకోరు. ఒక రోజు వాళ్ళ అమ్మ నవ్య, రవిని తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోయింది. దాంతో రజిత, వాళ్ళ నానమ్మ కలిసి ఉంటారు. రజిత  చదువుకు, అవసరాలకు వాళ్ళ నానమ్మ, రజిత అత్తయ్య చూసుకుంటారు. రజిత వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో రజితకు తెలిసింది.

రజిత వెళ్ళి అమ్మ నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అని అడిగితే, నాకు ఇంట్లో నచ్చడం లేదు అందుకే నేను వచ్చేసాను అని చెప్పింది. మరి నేను  ఏం పాపం చేసాను. నన్ను ఎందుకు వదిలేసావు అని అడిగితే.. నాకు  నువ్వు ఇష్టం లేదు. నాకు నవ్య, రవి వీళ్లిద్దరే కావాలి. అని చెప్పి రజితను పంపించింది. రజిత కూడా వాళ్ళ అమ్మ ప్రవర్తన నచ్చక వాళ్ళను వదిలేసి వాళ్ళ అత్తయ్య, నాన్నమ్మతోనే ఉంటుంది. దీనివల్ల రజిత చాలా బాధపడింది. ఒక రోజు రజిత అనుకుంది నేను బాగా చదువుకొని అనాదపిల్లలను, ముసలివాళ్లను చూసుకోవాలి. వాళ్ళకి నేను ఉన్నాను అని నమ్మకం ఇచ్చి వాళ్లని చూసుకుంటాను. అని నిర్ణయించుకుంది... కొన్ని నెలల తరువాత రజిత తన కర్తవ్యం కోసం ప్రయత్నిస్తుంది. ఒక రోజు తను అనుకున్నది సాధించింది. తాను ఒక ఆశ్రమం పెట్టింది. బయట అడుక్కునే అనాధ పిల్లల్ని, ముసలివారిని తీసుకవచ్చి చూసుకుంటుంది. రజితను చూసి వాళ్ళ అత్తయ్య, నానమ్మ చాలా గర్వపడ్డారు. రజిత కూడా చాలా సంతోషంగా ఉంది. అందరిని తన సొంతవరికంటే ఎక్కువ ప్రేమతోచూకుంటుంది.... 

"దయచేసి పిల్లల్ని గాని పెద్దవారిని వదిలేసి వెళ్ళకండి. కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించండి." తల్లితండ్రీ ఉండగానే పిల్లల్ని అనాథలను చేయకండి.

---MD రజియా

0/Post a Comment/Comments