మంచి మాటలు --మార్గం కృష్ణ మూర్తి

మంచి మాటలు --మార్గం కృష్ణ మూర్తి

_  కృష్ణమూర్తి

మంచి మాటలు

గప్పాలు వద్దు పది మందిముందు
గలగలా మాట్లాడటంకాదు,విను ముందు
గయ్యాలి మనుషులకు దగ్గరుండ వలదు
గడిచిన కష్టాలను గుర్తు పెట్టుకోవలదు

గళము మనిషికి వరం, చక్కగా మాట్లాడు
గరంగా ఉన్నవారికి దూరంగా ఉండు
గరళము త్రాగిన జనుల కాపాడుతుండు
గమ్యం చేరు వరకు ప్రయత్నిస్తుండు

గడువు వచ్చు వరకు వేచి చూడవలదు
గడిచిన సమయం తిరిగి రాదు
గళము ఉందని మాట జారవలదు
గరుకు గురువులైనా మరువ వలదు

గడప దాటు నపుడు మాస్క్ పెట్టుకో
గడువు తీరక ముందే మందులు వేసుకో
గడిపిన మంచి స్మృతులను గుర్తు చేసుకో
గట్టిగా ఉన్నపుడే మంచిని సంపాదించుకో

-------------------------------------------
మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments