కనుపించెడి దైవం-గురువు --వడ్ల నర్సింహా చారి

కనుపించెడి దైవం-గురువు --వడ్ల నర్సింహా చారి

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో

     కనుపించెడి దైవం-గురువు

*************************
            మణిపూసలు
*************************
---రచన:వడ్ల.నర్సింహా చారి,
జిల్లాపరిషత్ఉన్నత పాఠశాల, శేరిలింగంపల్లి.

గురువంటే తల్లిరా
గురువంటే తండ్రిరా
అక్షరాలు మనకు నేర్పు
గురువంటే బ్రహ్మరా!!

కొవ్వొత్తిగ కరిగిపోవు
బడియంటే మురిసిపోవు
నీ గెలుపే తనగెలుపని
అనునిత్యం వెలిగిపోవు!!

చదువులమ్మ గుడియందున
ముచ్చటైన బడియందున
నీకోసము వేచియుండు
పాఠశాల గదియందున!!

జ్ఞాన జ్యోతి వెలిగించును
ఓనమాలు దిద్దించును
నీ చెంతనె నేనంటూ
మన ఉన్నతి కాంక్షించును!!

బ్రహ్మ రూపుడై నిల్చెను
విష్ణు రూపుడై నిల్చెను
గురురూపమె తానంటూ
ఆదిదేవుడై నిల్చెను!!

చదువులన్ని నేర్పుతాడు
కథలనెన్నో చెపుతాడు
క్రమశిక్షణ గుండమనీ
హితవులనే పలుకుతాడు!!

కనిపించెడి దైవమితడు
బ్రతుకుమార్చు దేవుడితడు
బడిగుడిన వెలిసినట్టి
చదువులమ్మ సుతుడీతడు!!

గురువులేక జగతిలేదు
గురువులేక ప్రగతిలేదు
ప్రపంచాన ఎటుచూసిన
గురువులేని బడియు లేదు!!

--మణికర్ణిక
వడ్ల నర్సింహా చారి,
ఉపాధ్యాయులు,
జి.ప.ఉ.పా.శేరిలింగంపల్లి
చరవాణి:8500296119. 

0/Post a Comment/Comments