*కాళోజి నారాయణ*
*తెలంగాణ ముద్దుబిడ్డ*
*కవితలే జన జాగరణ*
*కళాకారులకిది గడ్డ*
*వారెవ్వా కళెన్నా*
*తెలంగాణ దార్శనికుడు*
*వెయ్యి గన్నులు చేయనిది*
*పని ఒక్క పెన్ను చేసును*
*అని నిరూపించిన ధ్వని*
*మన కాళెన్న పదును*
*ఒక్క సిరా చుక్క జూడు*
*లక్ష మెదళ్లను కదల్చిన వైనం*
*తన రాతలు జూడగ*
*ఉద్యమ కాలమున గను*
*చురకత్తులై రగులగ*
*రగిలే గుండెలను గను*
*తహతహ లాడుతు తను*
*సమర శంఖము పూరించాడు*
*కవితలంటే తెల్లని*
*కాగితముపై వ్రాసేటి*
*నల్ల అక్షరాలు కావని*
*కణకణము మండేటి*
*ఎర్రని నిప్పుఖనికలనే*
*మన కాళోజు నారాయణ*
*నిరంకుశ పాలనను*
*తూర్పార పట్టిన కలం*
*ఏకతాటిపై నడిపెను*
*మన కాళోజి గళం*
*వారెవ్వా మన కాళెన్నా*
*పట్టువదలని విక్రమార్కుడే ఆ దినం*
*తన ఒక్కొక్క అక్షరాన్ని*
*ఆయుధముగా మలిచేను*
*ఆ అక్షర ఆయుధాన్ని*
*ప్రజలకు అందించేను*
*వారెవ్వా మన కాళెన్నా*
*నిత్య సత్యాగ్రహ సమర శీలుడు*
*అదే పదునైన భాషతో*
*తెలంగాణ ఉనికికై*
*అలుపెరుగని పోరాటము*
*చేసెను మన జాతికై*
*ధైర్యము వీడని కాళోజు*
*బందీయైనా గెలిచి నిలిచాడు*
*తెలంగాణ అంతట తను*
*తిరిగి విద్యాకుసుమాలు*
*పూయించాలని తలచెను*
*అలుపెరగని కృషిన కలలు*
*తెలంగాణ ముద్దు బిడ్డ*
*సార్థకం తను చేసెను నాడు*
*ఒకవైపు కర్షకుడై*
*అక్షర సేద్యం చెసెను*
*మరో వైపు దర్శకుడై*
*జనాలకు బాట చూపెను*
*వారెవ్వా మన కాళెన్నా*
*తన కలాన్ని గళాన్ని పదునెట్టెను*
*గాంధీజి ఆశయాలను*
*ఆచరిస్తూనే తను*
*ఉద్యమ పులులను కూడ*
*ఉత్తేజ పరచి నడిచెను*
*వారెవ్వా మన కాళెన్నా*
*తెలంగాణ కొమురము*
*భరతజాతి బందీయైన*
*తన దాస్య శృంఖలాలను*
*తెంచాలని నరనరాన*
*తెగువను కసి నింపుకొనెను*
*వారెవ్వా మన తెలంగాణ బిడ్డ*
*వీరోచిత ఉద్యమ ధీరుడు*
*సాగిపోవుటే బతుకు*
*ఆగిపోతుంటే చావు*
*సాగదలిచిన నీకు*
*ఆగరాదిచట నీవు*
*అని అంటాడు మన కళెన్నా
*అత్యద్భుత కావ్యమే కదా ఇది*
నానా యిజములై
వెలిసిన అడుగుల్లో
నా యిజమే నాఅడుగై
నిలిపె ప్రజా గుండెల్లో
వారెవ్వా సిరా చుక్కల పదును
అది అందరిలో స్పూర్థిని ప్రేరేపించెను
వెలుగులు పంచిన చంద్రుడు
మన కవి కాళోజి గారు
అస్తమించని సూర్యుడు
మన కవి కాళోజి గారు
వారెవ్వా మన కాళెన్నా
ఆ తరం ఈ తరం అందరికి ఆదర్శం
అలుపెరగని శ్రామికయి
అందరిలొ ఉత్తముడయెను
స్వాతంత్ర్య కాంక్షితుడయి
తన స్వేదము చిందించెను
తెలంగాణ మన ముద్దు బిడ్డ
జయ జయహో మన కాళోజి
*బెజ్జారపు కళ్యాణాచార్యులు. కోరుట్ల*