అసలైన గురుదక్షిణ
--డా. కొణిదల శోభ, తిరుపతి.
నాడు తెలియలేదు నాకు
గురువు దిద్దించిన అక్షరాలు
అజ్ఞాన తిమిరాన్ని తొలగించే
జ్ఞాన జ్యోతులని
నాడు తెలియలేదు నాకు
గురువు పలికించిన పదాలు
శిలను శిల్పంగా మలిచే శిల్పి
చేతిలోని ఉలి తాలూకు
ఆనవాళ్ళని
నాడు తెలియలేదు నాకు
గురువు రాయించిన వాక్యాలు
విద్యతో పాటు వినయాన్ని
చదువుతో పాటు సంస్కారాన్ని
కలిగించడానికి వేసిన పునాదులని
నాడు తెలియలేదు నాకు
గురువు బోధించిన పాఠాలు
నా భవితకు బంగారు బాటలు
వేసే పరమపద సోపానాలని
నాడు తెలియలేదు నాకు
విద్యార్థుల ఎదుగుదలే తన
ఎదుగుదలగా భావించే
అల్ప సంతోషి గురువని
నాడు తెలియలేదు నాకు
గురువు మాటలు
అనురాగాల పూదోటలని
గురువుసాన్నిహిత్యం
మానవత్వాన్ని పరిమళింప
చేసే సాధనమని
అనురాగాల పూదోటలని
గురువుసాన్నిహిత్యం
మానవత్వాన్ని పరిమళింప
చేసే సాధనమని
నాడు తెలియలేదు నాకు
నేను తెలుసుకునే నాటికే
గురువు హారతి కర్పూరంలా
కరిగిపోయి ఉంటాడని
ఈనాడు తెలిసింది నాకు
గురువు త్యాగము ఔన్నత్యాల
గురించి తెలియాల్సింది తెలుసు
కోవాల్సింది ఇంకా ఎంతో ఉందని
అందుకే ఈనాటికీ నాకు పూర్తిగా
తెలియలేదు ఏమిచ్చి గురువు
రుణం తీర్చుకోగలనో అని
కానీ కాస్త గ్రహించగలిగాను
ఇన్నాళ్లకు
మంచిమార్గంలో నడిచి గురువు
పేరు నిలబెట్టడమే మనం
ఇవ్వగలిగిన గురుదక్షిణ అని
అదే ఆ అస్తమిస్తున్న సూర్యునికి
బ్రహ్మానంద సమానమని...
బ్రహ్మానంద సమానమని...
గురువులందరికీ శతకోటి
నమస్కారాలతో...
ఓ శిష్యురాలు
నమస్కారాలతో...
ఓ శిష్యురాలు