"అష్టదిగ్గజములు" రచన: రఘుపాత్రుని సాయిశివ

"అష్టదిగ్గజములు" రచన: రఘుపాత్రుని సాయిశివ

సీసముII
అల్లసానిరచన యమృతపురసధార
-----మనుచరిత్రయుపాఱె మధురఝరిగ
ముక్కుతిమ్మనకవి మురిపాలపద్యము
-----లాంధ్రమకుటమయ్యి యవనినిల్చె
నిస్వార్థభక్తికిన్ నిజమైనకావ్యమున్
-----తెలియధూర్జటియు నందించెమనకు
వికటకవి నిఖిలవిశ్వమ్ము లోనిల్చె
-----పాండురంగచరిత్ర పండజేసి

ఆటవెలదిII
భట్టుమూర్తి రచన భళిభళీ! యనిమెచ్చ
సూరనార్యు ఘనత శోభలిడెను
కవియురామభద్రు కావ్యంబురమ్యమై
మల్లనార్యు కృతులు మహినిశ్రుతులు

---------------------------------------
బి.ఎ. (తెలుగుసాహిత్యము) ద్వితీయ సంవత్సరం,
బ్రాహ్మణతర్లా గ్రామం, పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా. 



1/Post a Comment/Comments

Unknown said…
మీ రచన అమోఘం