వర్షాలా.. వరదలా..!?(కవిత) ---ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

వర్షాలా.. వరదలా..!?(కవిత) ---ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

వర్షాలా..వరదలా..!?(కవిత)

వర్షాలు..కావివి,
ఆకాశ ఆనంద హర్శాలు...!
కాని ఇవి వరదలైతే జీవితాలు కన్నీటి ప్రవాహాలు..!??
అతివృష్టి అతలాకుతలం చేస్తున్న సమయంలో జీవితాలు 
అగమ్యగోచరం..!??
కార్లు,బైకులు చిన్న పిల్లల ఆటబొమ్మల్లా వర్షపు నీళ్ళల్లో కొట్టుకు పోతుంటే, 
ఆశ్చర్యపోకతప్పదా..!??
కంటి ముందరి మనిషి కాల్వలో నీళ్ళు 
తన్నుకు తీసుకుపోతుంటే కాపాడలేని నిస్సహాయ దుస్థితి..!??
మోకాళ్ల దగ్గర నుంచి,
నడుము వరకూ నీళ్ళు..రోడ్డు దాటుతున్న వైనం..!??
కాలనీలోని ఇళ్ళల్లో వర్షపు నీరు బావిలా తలపిస్తుంటే..!
తూ తూ మంత్రంగా సహాయక చర్యలు..!
కేవలం పరామర్శలే..!గాని,
అగుపించని నిజమైన సహాయం..!??
కనిపించని వర్షపు నీటి తోడివేత..!??
దర్శనం ఇవ్వని మానవత..!??
ఉస్సూరు మంటున్న బాధిత ప్రజానీకం..!?

✍🏻విన్నర్
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments