తీరేనా రాధ వేదన
కృష్ణా !
నీ అడుగు జాడలకై తపిస్తున్న
సవ్వడి కానక సతమతమవుతున్న
యదలో అలజడి తో అల్లాడుతున్న
మది మురిసేలా నిన్ను నాలో
ఉండిపో మంటున్న
నీ అంతరార్థం తెలిసేలా ఆత్మస్థైర్యం పెంచుకున్న
నన్ను వదిలి వెళ్ళకు కృష్ణా
ఒకసారి నా దరిచేరు కన్నా
లక్షభావాలతో అక్షరార్చన చేస్తున్న
నీ పాద పూజకై నా హృదయం కలవరిస్థున్న
నీ దివ్య రూప సందర్శనం కై పరితపిస్తున్న
నీ ఊసుల విరహం భరించలేకున్న
నీ మమతానురాగాల బంధం నా సొంతం అన్న
ప్రేమ మాధుర్యంతో నీ మేనులో సగం అనుకున్న
నన్ను వదిలి వెళ్ళకు కృష్ణా!
ఒకసారి నా దరిచేరు కన్నా
ప్రేమకు చిరునామా రాధాకృష్ణులు అనుకున్న
మదిలోని మాట నోట మాట రాక
మధన పడుతున్న
నీ తోడు లేకుంటే మనసుకి
వేదనే కన్నా !
నన్ను వదిలి వెళ్ళకు కృష్ణా!
ఒకసారి నా దరిచేరు కన్నా
ఆకాశంలో హరివిల్లు విరియగా
మబ్బులు మాటున నెలవంక నవ్వగా
నీ చిరునవ్వుల విరిజల్లుల కై మేను పరవశించగా
తనువులు రెండైనా తపన ఒక్కటిగా
నింగి నుంచి నేల రాలిన తారలాగా
నన్ను వదిలి వెళ్ళకు కృష్ణా
ఒకసారి నా దరిచేరు కన్నా
నా మససు నీ వశమై పోయినే
ఆరాధనా తరంగాల ప్రేమ జల్లులో...
నీ ప్రణయం కై నా మనసు మురిసెనే...
క్షణ క్షణం నీ తలపుల తన్మయత్వం
కవ్వించి కనుమరుగయ్యే నీ మురిపెం
దరి చేరి తీర్చు రాధ మనసు
వేదన దూరం
దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
12/09/2021