స్వరమాంత్రికుడు బాలుకీ అక్షర నీరాజనం ---ఇమ్మడి రాంబాబు, తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు.

స్వరమాంత్రికుడు బాలుకీ అక్షర నీరాజనం ---ఇమ్మడి రాంబాబు, తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు.


గానగంధర్వుడు బాలుకి భాష్పాంజలి
గాన గాంధర్వ గాత్రధారి
అంతర్యామి..అలసితి సొలసితి
అంటూ.. ఏడు కొందలవాడి సన్నిధి కేగిరి.
పాటల పెన్నిధి ..పాటల మాంత్రికుడిగా
సంగీత సామ్రాట్ వై..గాన లహరిలో 
మునగంగా టాటా..బై బై చెప్పిన
శంకరాభరణ రాగాలాపన చేస్తూనే
శంకరుని నుదుట ఆభరణమయ్యావు
గాన సరస్వతీ మిమ్మనుగ్రహించే..
గాన కోకిలవై ..పాడుతా తీయగా తో
శతాధిక శిష్యులతో.. వాణీ,గీర్వాని లకు
స్వరాభషేకం చేశావు శివరంజని రాగ చంద్రికగా
మీ సుస్వర స్వర్ణ గళానా
పదహారణాల పడుచుల కోసం
యుగళ గీతాలు విరహ గీతాలు,
ప్రేమరస, సంగీత గీతాలు
16 భాషల పాటల ప్రేమికుల
పంచ సహస్ర గీతాలతో 
ప్రపంచ పాటలు ప్రియుల మనసును దోచి
విశ్వ చరిత్ర పుటలకు ఎక్కావు
భక్త పారవశ్య గీతాలాపనతో 
సకల మతాల భక్తుల గుండెల గుడిలో 
దేవుడు అయ్యావు.. నిత్య పూజలు అందుకొన
పండితారాధ్యుల బాలు. మీ రాగాల స్వర్ణ గళాన 
ముప్పది నంది పలు డాక్టరేటు పద్మభూషణ ఎన్నెన్నో అవార్డులు స్వర్ణాభరణాలతో శోభిల్లుతున్నారు
చలనచిత్రాలలో విభిన్న పాత్రలతో
ప్రేమ ప్రేమ కోసం పవిత్ర బంధం తో 
ముడి వేసుకుని.. మర్యాద రామన్న 
పోతులూరి బ్రహ్మంగారి పాత్రలతో 
సజీవుడవైన బాలుజి తాళికట్టు శుభవేళ ..
గీతాలు జీవిత పరమార్థమును..
చరమాంకం వరకు లోకానికి తెలిపావు
శత నటులకు గళ అర్పణ చేశావు
మల్లికార్జునాది శిష్యులకు
బతుకు బాట చూపావు.
మీ పాటలకు గ్లామర్ గ్రామర్ ప్రాణం మీరే
ఈ లోకం లో ఇక సెలవు అని 
స్వర్గలోకం మీ స్వర లహరి వినిపించ.. 
దివి నుండి భువికేగిన మీకు
అశేష జనులు తేలుపుతున్నారు 
కన్నీటి వీడ్కోలు... ముకుళిత హస్తాలతో
అంజలి ఘటిస్తున్నారు. అయినా 
ప్రతి గాయకుని గళంలో  మీరు సజీవం.
గాన గంధర్వుడు బాలు కి
నా అక్షర పుష్ప భాష్పాంజలి

కన్నీటితో రాసిన .. నా కవితా పుష్పం
ఇమ్మడి  రాంబాబు 
తొర్రూరు మహబూబాబాద్( జిల్లా)

గానగంధర్వుడు బాలుకి భాష్పాంజలి(శీర్షిక)
గాన గాంధర్వ గాత్రధారి
అంతర్యామి..అలసితి సొలసితి
అంటూ.. ఏడు కొందలవాడి సన్నిధి కేగిరి.
పాటల పెన్నిధి ..పాటల మాంత్రికుడిగా
సంగీత సామ్రాట్ వై..గాన లహరిలో 
మునగంగా టాటా..బై బై చెప్పిన
శంకరాభరణ రాగాలాపన చేస్తూనే
శంకరుని నుదుట ఆభరణమయ్యావు
గాన సరస్వతీ మిమ్మనుగ్రహించే..
గాన కోకిలవై ..పాడుతా తీయగా తో
శతాధిక శిష్యులతో.. వాణీ,గీర్వాని లకు
స్వరాభషేకం చేశావు శివరంజని రాగ చంద్రికగా
మీ సుస్వర స్వర్ణ గళానా
పదహారణాల పడుచుల కోసం
యుగళ గీతాలు విరహ గీతాలు,
ప్రేమరస, సంగీత గీతాలు
16 భాషల పాటల ప్రేమికుల
పంచ సహస్ర గీతాలతో 
ప్రపంచ పాటలు ప్రియుల మనసును దోచి
విశ్వ చరిత్ర పుటలకు ఎక్కావు
భక్త పారవశ్య గీతాలాపనతో 
సకల మతాల భక్తుల గుండెల గుడిలో 
దేవుడు అయ్యావు.. నిత్య పూజలు అందుకొన
పండితారాధ్యుల బాలు. మీ రాగాల స్వర్ణ గళాన 
ముప్పది నంది పలు డాక్టరేటు పద్మభూషణ ఎన్నెన్నో అవార్డులు స్వర్ణాభరణాలతో శోభిల్లుతున్నారు
చలనచిత్రాలలో విభిన్న పాత్రలతో
ప్రేమ ప్రేమ కోసం పవిత్ర బంధం తో 
ముడి వేసుకుని.. మర్యాద రామన్న 
పోతులూరి బ్రహ్మంగారి పాత్రలతో 
సజీవుడవైన బాలుజి తాళికట్టు శుభవేళ ..
గీతాలు జీవిత పరమార్థమును..
చరమాంకం వరకు లోకానికి తెలిపావు
శత నటులకు గళ అర్పణ చేశావు
మల్లికార్జునాది శిష్యులకు
బతుకు బాట చూపావు.
మీ పాటలకు గ్లామర్ గ్రామర్ ప్రాణం మీరే
ఈ లోకం లో ఇక సెలవు అని 
స్వర్గలోకం మీ స్వర లహరి వినిపించ.. 
దివి నుండి భువికేగిన మీకు
అశేష జనులు తేలుపుతున్నారు 
కన్నీటి వీడ్కోలు... ముకుళిత హస్తాలతో
అంజలి ఘటిస్తున్నారు. అయినా 
ప్రతి గాయకుని గళంలో  మీరు సజీవం.
గాన గంధర్వుడు బాలు కి
మొదటి వర్ధంతి నా
అక్షర పుష్ప భాష్పాంజలి

కన్నీటితో రాసిన .. నా కవితా పుష్పం
ఇమ్మడి  రాంబాబు 
తొర్రూరు మహబూబాబాద్( జిల్లా)
తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు







 

0/Post a Comment/Comments