భగత్ సింగ్. --- శ్రీమతి సత్య మొం డ్రేటి

భగత్ సింగ్. --- శ్రీమతి సత్య మొం డ్రేటి

దివికేగిన స్వాతంత్ర సమరయోధుడు
ఉద్యమ కారుడు
ప్రజాచైతన్య శీలి
విప్లవ వీరుడు భగత్ సింగ్
నవజవాన్ భారత సభ స్థాపకుడు
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ స్థాపక సభ్యుడు..
భారత, బ్రిటన్ ఖై సమాన
హక్కుల కోసం అరవై నాలుగు
రోజులు నిరాహారదీక్ష కుడు..
మానవతా వాది భగత్ సింగ్
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు లాలాలజపతి రాయిని బ్రిటిష్ వారు హత్య చేసినందుకు.. భగత్ సింగ్ ఉద్రేకంతో పోలీస్ అధికారిని కాల్చిచంపాడు....
మాతృభూమి స్వేచ్ఛ కోసం ఉరికంబం ఎక్కాడు.... ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ
ఉరి తాడును పూలహారం లా ఆహ్వానించాడు... ధైర్యసాహసాలకు మారుపేరైన భగత్ సింగ్ భారతీయుల స్వాతంత్ర శ్వాస... భారతదేశ శృంఖలాలను చిధ్రంచేసిన మహావీరుడు..
భారతీయుల హృదయంలో చిరస్మరణీయుడు....
అతి చిన్న వయసులో దేశం కోసం త్యాగం చేసిన వీర పరాక్రమశాలి భగత్సింగ్ జీ
సహస్త్రకోటి అక్షర నీరాజనాలు..

0/Post a Comment/Comments