తెలుగు సంస్కృతి
జాతికి వెలుగు
తెలుగు సంస్కృతి అద్వితీయ ము
తెలుగు సంస్కృతి అపూర్వం
ప్రాచీన కాలం నుండి
ఆధునిక కాలం వరకు
మకుటం లేని మహారాజుగా
ఇంతింతయి వటు డీన్ తయి అన్నట్లు అటు
భాగ్యనగరము నుండి విజనగరం వరకు
ఇటు బాసర సరస్వతీ క్షేత్రం నుండి
తిరుమల తిరుపతి వరకు
దే దీప్యమానముగా విరాజిల్లుతూ
భారతావని అంతటా మెరిసిపోతూ
సప్త సాగరములు దాటి
ఎల్లలు మరచి ఏళ్లలోకమంత వ్యాపించి
ఉపనిషత్తులు, చతుర్వేదముల సారాన్ని
జగతికి అందించి
సకల జనుల హృదయాలలో
నిలిచి వెలిగి
తెలుగు జాతికి వెలు గై
దరిత్రి కి మార్గదర్షియై
ప్ర కాశిస్తుంది తెలుగు సంస్కృతి
వర్ధిల్లుతుంది తెలుగు సంస్కృతి
రచన
సంకెపల్లి శ్రీనివాసరెడ్డి
(యస్ యస్ ఆర్)