కంటే కూతురునే కను
కూతురు నా వెలుగు
నా ఇంటి వెలుగు
నా కంటి వెలుగు
నా జీవితపు వెలుగు
నా ఇంటి దీపం
నా కంటి రూపం
నా ప్రతి రూపం
నాకు అపురూపం
పంచుకుంది నా నెత్తురు
నా ఇల్లంతా సుగంధాల అత్తరు
నా ఇంటిలోన వెలుతురు
నా ఇంటి ఆనందాల పన్నీరు
నా గుండె చప్పుడు
నా మది సవ్వడి
నా ఊహకు రూపం
నా హృది ప్రాణం
కూతురు ఉన్న ఇంట కళ కళ లు
కూతురు ఉన్న ఇంట నిండు సిరులు
కూతురు ఉన్న ఇంట మణులు మరకత మాణిక్యాలు
కూతురు ఉన్న ఇంట సరదాల పంట
కంటే కూతుర్నే కను
కలగంటే కూతురు కోసం కల గను
కూతురంటే లక్ష్మీ
కూతురుంటే ఆ ఇంట మహాలక్ష్మీ
రచన: పసుమర్తి నాగేశ్వరరావు
సాలూరు
విజయనగరం జిల్లా