అంశం: చిత్ర కవిత
శీర్షిక: సింధూర బంధం
ఆకాశవీధిలో
అపురూప కానుక
సింధూర వర్ణపు చిద్విలాసం
సంధ్యా కాంతుల సోయగం
ఆదిత్యుని అవతారక్రమం
గగనవేదిక లో గంధర్వ గానం
ఆంజనేయుని అమృతఫలం
సింధూర మే సింగారం
అవని కి బంగారం..
సింధూరపు సూర్యుడు
ముదిత నుదుట వెలిగే రవిబింబం
జగానికి ఆలంబనం సూర్యుని కిరణం..
సింధూర వర్ణ మే సకల శుభాల నిలయం..
సంకల్పానికి శుభకరం
పంచభూతాల ప్రకృతి అమ్మ వరం...
నీరాజనం నీకు దినకరా
అక్షర నీరాజనం నీకు శుభకరా....
పేరు శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు హైదరాబాద్
చరవాణి 9 4 9 0 2 3 9 5 8 1