సూర్యసందేశం
అది
చేయి తిరిగిన
ఎంతో నైపుణ్యమున్న
ఓ ఫోటోగ్రాఫర్ ట్రిక్కే ఐనా
దానికి ఒక లెక్క ఉంది
అందులో అనంతమైన
"సూర్యసందేశం" దాగి ఉంది
ఈ జీవితమే ఒక పయనమని...
అది తూర్పు వైపుకేనని...
చేరలేని సుదూర తీరాలకేనని...
ఎంత దూరమైనా
ఎంతో భారమైనా
ఎంతటి అంధకారమైనా
వెలుగు వేట
వెలుగు వెతుకులాట
వెర్రతనమేమీ కాదని...
వెలుగునే మోసుకుపోయేవారికి
ఇక చీకటంటూ ఎక్కడిదని...
ఎంత దూరప్రయాణమైనా
ఒక అడుగుతోనే ప్రారంభమని...
సూర్యునికంటే ముందులేచిన వాళ్ళు
సుఖపడతారని...
పుష్టికరమైన ఆహారం తీసుకున్నవారు
షష్టిపూర్తి చేసుకుంటారని...
ఆలస్యంగా నిద్రలేచిన బద్దకస్తులు
సూర్యోదయాన్ని చూడలేరని...
విజయాన్ని చూసి ఓటమి
వెలుగును చూసి చీకటి భయపడుతుందని...
సూర్యుడు ప్రతిమనిషికి ఒక స్ఫూర్తి ప్రదాతని...
ఆ సూర్యుని శక్తి ,అపారమైన ఆ భగవంతునిపై భక్తి
ఉన్న ప్రతివ్యక్తి పొందునని...ముందుజన్మలో ముక్తి
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502