సాహిత్య సృజన ----శ్రీమతి సత్య మొం డ్రేటి

సాహిత్య సృజన ----శ్రీమతి సత్య మొం డ్రేటి

1.సాహిత్య సృజన 
బాల్యాన్ని మించిన అదృష్టం లేదు.
చిన్ననాటి జ్ఞాపకాలు బ్రతుకు లోవరాలు.
బాధ వేదన కలిసి రాదు
చివరికి మిగిలేది బ్రతుకులో జ్ఞాపకాలు.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన 

2.జీవితం కష్ట సుఖాల సంగమం. 
కష్టాలు సుఖాలు సమం గా        తీసుకోవాలి
  జీవితం సప్త సాగర సంగమం
  కష్టాల్లో   ఓర్పు,తోతీరాన్ని చేరాలి .
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.

3.మధుర సంగీత సప్త స్వరాలు
గానం మనసును రంజింప చేయును
మనసే  సుందర బృందావన అందాలు.
గాయకుల  సరిగమల తో ఆరోగ్యం చేకూరును.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.

4. ఏసుక్రీస్తు సిలువైన మంచి శుక్రవారము
సత్యమే ఆత్మ అని తెలియ చెప్పిన రోజు 
ఏడేడు తరాలకు జీసస్ దైవము
సత్ప్రవర్తన యే  మతం అని
చాటి చెప్పిన రోజు.
తెలుగు కువెలుగు సాహిత్య సృజన.

5.ఆశల ఆలయా న ఆశయమే దేవుడు
దేవుని లోగిలో అందరూ భక్తులే
ఆశయ విజయ సాధనకు మానవుడు
దేవి సహకారంతో గెలుపు పొందినవారు  సాధకులే
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.

6.వృద్ధాప్యం శాపం కాదు వరము.
గతకాలపు వైభవానికి చిహ్నాలు వారు.
వృద్ధులు మన వారసత్వ వంశము.
గత చరిత్రకు ఘన కీర్తి కి నిదర్శనాలు వారు.
తెలుగు వెలుగు సాహిత్య సృజన.

7. వేప లోని చేదు ఆరోగ్యానికి మంచిది.
మనిషిలోని సుగుణాలు మానవతకు గురుతు.
వేకువజాము లో ధ్యానము చేయుట గొప్పది.
మనమంతా సహకారంతో ఉపకారం చేయడ మే జయతు
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.

8.ఓర్పు నేర్పు ఉంటే కష్టాన్ని 
ఇష్టంగా మలచుకుని బ్రతుకు 
ఓర్చు కోవాలి జననమరణ చక్రాన్ని
ఇంపుగా తిరగనివ్వాలి చివరి వరకు
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

9.సంగీత సాహిత్య శిల్ప చిత్రకారులు
కారణ జన్ములు బ్రహ్మ అంశను
సరస్వతి మాత ప్రియ పుత్రులు
కాలమే వారికి మహా కావ్య మగును
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన


10.ఏడు వారములు 6ఋతువులు. 
12 నెలలు లు కాల కొలమానము.
వానా కాలం చలికాలం  వేసవికాలాలు పర్యావరణ ప్రకృతి. 
ఏ కాలమైనా నా అందుకు తగిన శీతోష్ణస్థితి జనావళికి ఆలవాలము
వారధి కట్టి వానజల్లు ను నదిలో పట్టి చేస్తున్నారు సేద్య ప్రగతి.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

11.ఎన్నో సూపర్ బజార్లు వస్తున్నాయి.
కొందరికి ఉపాధి మార్గం అవుతుంది.
ఎందరికో ఆర్థిక బాధలు తీరుతున్నాయి.
కొంచెం కొంచెం గా ప్రజల కష్టం తీరుతుంది.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

12.ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు.
భరతజాతి కి ప్రపంచానికి  పేరు తెచ్చిన నాగరికత.
ఆరాధనతో మనం ఆచరించాలి సంప్రదాయక పద్ధతులు.
భగవద్గీత మన జీవన జీవించే విధానాన్ని తెలియజేసే మాత.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

13.చైత్రమాస వెన్నెల లో కోకిలమ్మ కూత
విరి జల్లుల వసంతం లో హరివిల్లుల సంబరము
చైతన్య పు  సంగమము లో కోర్కెల కెరటాల మోత
విచిత్ర వర్ణాల వింత వింత ఆనందము.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన. 
 14.భారత దేశముసంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు .
దేశ భాషలందు తెలుగు లెస్స
భావితరాలు కు ఇవ్వాలి స్వచ్ఛమైన ప్రకృతి.
దేవుని కోసం అంగరంగ వైభవంగా ఆలయాలు హైలెస్స
తెలుగు వెలుగు సాహిత్య సృజన.
15.కాకులు దూరని కారడవి నందున
సూర్యుడు ఉదయించి అడివిని రక్షిస్తాడు.
కారుణ్యము మనిషి లోని మానవత్వం చూపి నందున
సూక్తులు వింటే మనిషి మంచిగా మారుతాడు
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన
16.పరుల కోసం పాటుపడే వాడు పరోపకారి
తన కోసమే తన గురించే చూసేవాడు స్వార్థపరుడు
పగలు రాత్రి బేదం లేకుండా ప్రగల్బాలు పలికే వాడు మోసకారి.
 తరతమ్యం చూడకుండా అందరూ తన వాళ్ళుగా చూసేవాడు స్నేహితుడు.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

17.ప్రకృతి అందానికి మించిన అందం లేదు
మహాత్ముని కంటేమంచి వ్యక్తి లేడు.
ప్రజా సేవ కంటే ఉత్తమం లేదు
మంచి మనసున్న మనిషే మహనీయుడు.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన

18.అనుభవాలే జీవిత పాఠాలు అంటారు
కష్ట సుఖాలు జీవితంలో అనుభవాలు గా తీసుకోవాలి
అనురాగం ఆత్మీయత అభిమానం మరువరు
కలకాలం కళకళ లాడుతూ ఉండాలి.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.

19. పంకంలోని పద్మము
పుట్టిన మలినముఅంటదు
దుష్టులమధ్య ఉన్నా మంచి మనిషి లో రాదు మార్పు
పదాల అల్లిక తో‌ కవితల మాల గుభాళించదు
దుర్మార్గులను మంచిగా మార్చాలంటే కావాలి ఓర్పు
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

20. సరిగమల సంగీత స్వరాల వీణ
వాగ్గేయకారుల రసరమ్య గీత ఆలాపన
సత్యమేవ జయతే అన్నది వాస్తవ ప్రవీణ
వారసత్వం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న తపన
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన



21.బాల్యం అందమైన సుందర సుకుమారము
మరువలేని మరపురాని మధురమైన దీపిక
బాధలు  వేదన లు  బాధ్యతలు
తెలియని స్వప్న లోకము
మనిషి జన్మ లో స్వర్ణ అక్షరాల
 జ్ఞాపిక.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.



22.చిన్ననాటి ఆటలు ముత్యాల మూటలు
గో ళీలు , బిలం గోడు , కబడ్డీ, ఆట
చిట్టి, పొట్టి, గుజ్జనగూళ్ళు, ఆటలు
గోవుల, మందలు ,మే పేటి. చోట
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన




23.వసంత ,వేళలో, విరబూసిన తరువులు.
మకరందం ,కోసం, వాలిన తుమ్మెదలు.
 వన కన్యలు ,వసంతుడు తో, 
వయ్యారాల ,సయ్యాటలు.
మనసులో, రాగ రంజిత, మధుర ,ఊహలు.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

24. రసరమ్య ప్రకృతి లో మధుమాస హేల
సుందర నందన వనం లో కోకిలమ్మ కూత
రవి కిరణకాంతిలో విరి బాలల ఊయల.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన



25.చిన్ననాటి ఆటలు ముత్యాల మూటలు
గో ళీలు  బిలం గోడు  కబడ్డీ కోకో.. మరుగునపడిన మస్తిష్కపు మూట

చిట్టి పొట్టి చిన్ని చిన్ని గుజ్జన
గుళ్ళ ఆటలు
గోపురం లో చెక్కిన శిల్పాలుగా గుర్తుండే పూల తోట.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

26.ఫ్లవరుడా, వసంత, ఆగమనానికి , వస్తున్నావా
స్వాగతం ,నీకు ,సుస్వాగతం, సహృదయంతో.
ఫ్లవ. నామముతో. ఆశల ఫలాలు, తెస్తున్నావా.
స్వాతి వాన కు, ముత్యంలా, నిరీక్షిస్తున్నాము, కోటి కోర్కెలతో.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

27. ఆరోగ్యమే మహాభాగ్యము ఆనందమే సౌభాగ్య ము
నవ్వుతూ బ్రతకాలి నవ్వే మనకు సిరి సంపదలు
ఆధ్యాత్మికత మానవ జీవితం లో పరమపద సోపానము
నలుగురూ కలసిమెలసి పరస్పర సహకారమే సిరులు
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.

28. చిట పట చినుకుల
 వాన పడుతుంది.
ఆకాశం లో మేఘాలు ముచ్చట్ల
పెడుతున్నాయి.
చిత్తడి చిత్తడిగా నేల  తడిచిం
ది.
ఆనందం గా ఆర్తి గా పంట చేలు వానను ఆహ్వానిస్తు న్నాయి.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.



29.బాలలపాఠశాల మురిపాల ముచ్చట్లు
సహ విద్యార్థుల స్నేహ కేరింతల సరదా
బాపుబొమ్మల బాలలు నడ తల అచ్చట్లు
సందడి చేసే బడి గంట ల గణ గణ ల వర దా...
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన




30.నవ్య ఉగాది ,జగానికి, జనానికి    
కోటి ఆశల ఘనమైన నివాళి.
తీపి పులుపు, కారం లవణానికి, 
వగరు చేదుల ,  మిశ్రమ కేళి
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

31.నవవసంతంలో, కోకిలమ్మ కుహుకుహు రాగాలు.
తీపి తెలుగు, తేనెకన్నా, చెరకు
రసము కన్నా మధురమీ రుచులు
ఉగాది విలువలు తెలుపు మనకు.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

32.అఖండ భారతావని మన పుణ్యభూమి.
సంస్కృతి సంప్రదాయాలకు పేరు పొందినది
అలవి కాని ప్రకృతి సంపదకూరి
మి
సత్పురుషులు మహర్షిలకు పే రు గాంచినది.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన

33.ఫ్లవరుడా, వసంత, ఆగమనానికి , వస్తున్నావా
స్వాగతం ,నీకు ,సుస్వాగతం, సహృదయంతో.
ఫ్లవ. నామముతో. ఆశల ఫలాలు, తెస్తున్నావా.
స్వాతి వాన కు, ముత్యంలా, నిరీక్షిస్తున్నాము, కోటి కోర్కెలతో.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.



34.శ్రమైక జీవన సౌందర్యo మిన్న
మానవ జీవన యానం మజిలీ
శ్రమతో పెరుగు చిలికితే వస్తుంది వెన్న
మాట మీద నిలవని వారు చేస్తారు బదిలీ.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.



35.ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి
ఉండాలి అని పెద్దలు చెబుతా
రు.
ఎదురు మాటలు చెప్పడం ఎరిగి
ఉలిక్కిపడి భుజాలు తడుము కోరు.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన


36.శ్రమైక జీవన సౌందర్యo మిన్న
మానవ జీవన యానం మజిలీ
శ్రమతో పెరుగు చిలికితే వస్తుంది వెన్న
మాట మీద నిలవని వారు చేస్తారు బదిలీ.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.



37.రాజకీయఅవగాహన ప్రజలకు
తెలియజేయాలి
ఓటు ను నోటు కు  అమ్మరాద
న్న సృహ తెలియాలి
రాజుల సామ్రాజ్యాలు గురించి
తెలుసుకోవాలి
ఓటు మన ప్రాథమిక హక్కు అని ప్రజలకు తెలియాలి
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన
 38.ఘనమైననాలుగు వేదాల
కు పుట్టినిల్లు.
ఆసేతు హిమాలయ పర్వతాల నిలయము
ఘన చరిత్ర   గత వైభవానికి  మూలము
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన
39/.మనిషి  ఆనందంతో  జీవితం గడపాలి.
ఆర్థిక బాధలు లేకుండా  సంతృప్తి కలగాలి
మనసులో మలినము ,మాయ ఉండరాదు
ఆ రోజు అందరికీ నిజమైన పండుగ
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన




40.వేదిక లెక్కి ఉపన్యాసాలు ఇస్తారు
ఆచరణలో లేదు  అభ్యుదయం
అన్నది నిజం
వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తారు అభివృద్ధికి
ఆకలి కి మాత్రం లేదు అంతం
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

41. కుల మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యము
అంబేద్కర్ ఆశల నిలయం భారతము
కుల మత వర్గ వర్ణ భేదము లేని రాజ్యాంగ ము
అభివృద్ధికి మూల కారణం అంబేద్కర్ ఆశయం
తెలుగుకు వెలుగు సాహిత్య, సృజన
42. బడుగు వర్గాల అభ్యున్నతి ద్వేయము
అంబేద్కర్    ప్రజా పోరాట యోధుడు 
బలహీన వర్గాల అభ్యున్నతి మూలము
అభివృద్ధి కి అంబేద్కర్ మూల పురుషుడు
తెలుగుకు కు వెలుగు సాహిత్య సృజన




43.బలమైన విశ్వాసముతో విజయాన్ని సాధించేవాడు
ప్రజా అభ్యుదయ మే ప్రగతి
అని నమ్మినవాడు.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన
  44.అంబేత్కర్  బారత రాజ్యాంగ నిర్మాత
అట్టడుగు వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి
 అల్ప సంఖ్యాక వర్గం కోసం చూపిన త్యాగశీ లత
అసమాన ఆలోచనతో రచనా రాజ్యాంగ యుక్తి.
తెలుగుకు వెలుగు గు సాహిత్య సృజన

45.విశ్వామిత్ర  వశిష్టులు  యజ్ఞయాగాలు  రాక్షసుల నుండి
రక్షణ కోసం రామలక్ష్మణులను అరణ్యానికి తీసుకెళ్ళారు
విశ్వాన్ని కాపాడ టానికి పుట్టిన రామ లక్ష్మణులు మునుల యజ్ఞాలను  రాక్షసులనుండి 
రక్షించి ఋషుల తపస్సు కాపాడారు.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన

46.రామలక్ష్మణ భరత శతృఘ్న లకు
విశ్వామిత్రుడు వశిష్ఠుడు విద్య నేర్పిన గురువులు
రామాయణ  గ్రంధకర్త వాల్మీకి, విశ్వామిత్రుల కు
విద్య లను అభ్యసించిన ఖుషి వర్యులు.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

47.అయోధ్య నగరానికి రాజు దశరథుడు
సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసాడు
అతనికి రామలక్ష్మణులు భరతు డు శత్రుఘ్నుడు
సంతానంగా జన్మ నిచ్చాడు దశరథుడు.
తెలుగు కు వెలుగుసాహిత్య సృజన

48.సూర్య చంద్రులు ఉన్నంత కాలము
రామాయణ కావ్యం చిరస్థాయిగా నిలుస్తుంది.
సూర్యవంశ రాజులు ఘనత అపూర్వము
రాముడు దేవుడు.. సీత  దేవత
ప్రజలకు  తెలిసింది
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.

49.సీతా స్వయంవరానికి ఎందరో రాజులు వచ్చారు
ఒక్కరు కూడా హరి విల్లును ఎక్కుపెట్టలేదు
సీతా దేవి వరమాల తో ఉంది రాజులంతా చూస్తున్నారు
ఒకే ఒక్క శ్రీరాముడు శివుని విల్లును విరిచాడు..సభ వారు
అనుకోలేదు.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

50.వసంత మాసం లో నవమి నాడు శ్రీరాముడు జన్మించాడు
సీతారాముల కళ్యాణం చైత్రమాసనవమినాడు జరిగింది
వసంత నవరాత్రులలో శ్రీరాముడు కొలువైనాడు
చైతన్య వంతుడైన శ్రీరాముని కళ్యాణం వైభవంగా జరుగుతుంది.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన
51.వాల్మీకి అశ్ర మాన  లవకుశ లు పుట్టారు
అల్లారుముద్దుగా  కుశలవలు
పెరిగి పెద్దయ్యారు
వాల్మీకి నేర్పిన రామాయణ గానాన్ని వినిపించారు
అయోధ్యలో ముని కుమారులుగా అడుగు పెట్టారు.
తెలుగు కు వెలుగు
సాహిత్య సృజన.

52.సీతారామ  కళ్యాణానికి చలువ పందిళ్ళు
లోకకళ్యాణార్థం ప్రతి యేడు శ్రీరామనవమికి కళ్యాణము
సీతా కళ్యాణం చూడడానికి సరిపోవు వేయి కళ్ళు
లోకాభిరామం శ్రీరామం సద్గుణ దామం సుందర రామము
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.

 53. అవార్డులు రివార్డులు లేని జీవితం గృహిణి ది
కుటుంబ సంక్షేమానికి గృహిణే వెన్నెముక.
అందరికీ అన్నీ అమర్చి తనను తాను మరిచిపోయేది.
కుదురుగా కూర్చుని ఎరుగని నిరంతర శ్రామిక.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

54.గృహిణి  వంట చేసి  వడ్డించడం లో నేర్పరి.
సకల కళల లోను నైపుణ్యం ఉంటుంది.
గృహమే కదా స్వర్గసీమ. ఆ సీమను ఏలే‌ గడుసరి.
సంసార సామ్రాజ్యం పొదుపుగా నడుపుతుంది.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన

55.భర్త సౌఖ్యం పిల్లల భవిష్యత్తు కోసము
జీవితాన్ని త్యాగం చేసిన మహిళా మణి
భరించే శక్తి ‌ ఓర్పు సహనం త్యాగము
జీవన మాధుర్యం ఆత్మీయత  అనురాగాల గృహ రాణి.
తెలుగుకు వెలుగు‌ సాహిత్య సృజన
56. ఆచార్య ఆత్రేయ మనసు కవి
మనసును స్పందించే గీతాల రచయిత
ఆలోచనతో అందరికీ ఆనందం పంచేరవి.
మనసున్న మనిషికి సుఖం లేదంత
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన


57.అమ్మ అంటే అందరికీ ఇష్టము
నాన్న అంటే అందరికీ ప్రేమ
అమ్మ నాన్న ల కలయిక కుటుంబము
నా అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు మాకు ప్రేమ
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన


58.అక్క చెల్లెలు అన్నా తమ్ముడు
బావా  మరిది వదిన మరదలు
అందరూ ఆత్మీయులే ముద్దుగారే మేనల్లుడు
బాల్యంలో కలిసిమెలిసి ఆడిన ఆటలు
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

59 జీవితం ఏడు  రంగుల  ఇంద్రధనస్సు
కష్ట సుఖాలు కలిమి లేములు
 జీవితం లో వచ్చి పోయే యశస్సు
కలతలు , సమస్యలు వచ్చిపోయే చుట్టాలు
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన
60.పంచభూతాల ప్రకృతి నాకు ఆకృతి.
గాలి  నీరు , నిప్పు ఆకాశం భూమి
పంచ మూలకాలు మనకు జీవన భృతి.
గారెల  విందు భోజనానికి  లేదు లేమి.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

61. బలివాడ కాంతారావు మంచి రచయిత
ఎన్నో నవలలు కథలు ‌ రాశాడు
బలమైన సాహిత్య ప్రక్రియల రచయిత
ఎందరికో తన రచనలను చదివించాడు.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన
 62. కను విను తిను చూడు
చెడు వినవద్దు చెడు చూడొద్దు
కన్నులతో సుందర దృశ్యాలను చూడు
చెవులతో చెడు మాటలు వినవద్దు
తెలుగుకు వెలుగు సాహిత్యసృజన మందలోమనిషివి కాదు నీవు
వందలో ఒక్కడు వి కావాలి నువ్వు
మనసున్న  మనిషిగా పేరుతో ఉంటావు.
వడివడిగా ఎదగాలి.. ఉండాలి పెదాలపై నవ్వు  .
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన




63.పోటీల కోసం పాట్లు పడతారు
జనాన్ని జాగృతం చేసి కాకా
పోరాటం చేసి గెలుపు‌ పొందా
   ‌                                      రు
జయ పతాకం వేస్తారు కడదా
                                        కా
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన
64.ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు  అవుతున్నాయి
చిన్న  కుటుంబాలు  చింత లేనివి
ఉజ్వల భవిష్యత్తు ఊహిస్తూ  ఉన్నాయి.
చిన్నా  భిన్నం అవుతున్నాయి కుటుంబాలనేవి.
తెలుగు కు వెలుగు సాహిత్య సుగుణ.

65. భార త దేశ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది.
ప్రపంచానికి ఆదర్శ ము  మన కుటుంబము
భారతీయుల సంస్కృతి  సంప్రదాయము ఖ్యాతి గాంచింది.
ప్రతి  దేశము నకు మన కుటుంబ వ్యవస్థ  ఆదర్శనీయము.
 తెలుగు కు వెలుగు సాహిత్య   సృజన.


66.ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణము
కుటుంబ సంక్షేమమే  దేశ అభివృద్ధి
ఏ దేశ మైనా  ప్రజల ఆర్థిక స్థితిగతుల ఆలవాలము
కుచేలుడైన కు బేరుడైన కావాలి  జీవన సంవృద్ది
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

67.రంజాన్ ఖురాన్ పుట్టిన నెల
ముస్లిములు ఉపవాస దీక్ష  వహిస్తారు
రకరకాల రుచులు లతో  విందుల
ముదమార దీక్షను  రోజంతా కొనసాగిస్తారు
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన


68.సూర్యోదయం నుండి ఇ సూర్యాస్తమయం వరకు
ఉపవాస దీక్షను కొనసాగిస్తారు ముస్లింలు.
సూర్యాస్తమయంతో   రక రకాల విందు అందరకు
ఉప హారాలతో  విప్తార్ విందును చేస్తారు ముస్లింలు
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన

69.హలీం ప్రత్యేకమైన రంజాన్ వంట
హిందువులు ముస్లింలు సమతా భావంతో తింటారు
హడావిడిగా నెలవంక చూసి దీక్ష మొదలు పెడతారంట
హిందూ ముస్లిం బాయి బాయి అంటూ ముగిస్తారు
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

 70.. మరాఠీ సామ్రాజ్య స్థాపకుడు శివాజీ
శివాజీ పెద్ద కుమారుడు శంబూజి
మతసహనం పాటించిన హిందువు శివాజీ
శివాజీ చతపతి గా ధర్మవీర్ గా  శం భూజీ.
 తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

71..జిజియా బాయి శివాజీ  తల్లి
రామాయణ భారతాలు తో పెంచిన మాతృ మూర్తి
జిజ్ఞాస శివాజీ  పరాక్రమానికి లొల్లి.
రారాజుగా  రాజ్య మేలిన  ఘన కీర్తి
తెలుగు కి వెలుగు సాహిత్య సృజన

72.మొగల్ చక్రవర్తులు ను ఓడించిన ధీరుడు
హిందుత్వం ఆచరించిన మరాఠా చక్రవర్తి
మొదటి గురువు గా తల్లి ని పూజించిన ఘనుడు.
హిందూదేశం కి ఛత్రపతి శివాజీ
ఘనకీర్తి.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన






73.వినీల ఆకాశంలో నక్షత్రాల మెరుపులు
అందాల  అవనిలో  బంధాల ఆత్మీయత
విశాల హృదయంలో అభ్యుదయ భావాలు
అందరికి కావాలి అనుబంధాలు ఆత్మీయతల
 ఆప్యాయత
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.


74.ఆది  శంకరాచార్యులు ఆరాధ్య  దైవము .
సౌందర్య లహరి రచించిన మహాకవి.
 ఆరాధించిన భక్తులను ఆశీర్వదించే గుణము
సౌజన్యంతో భక్తుల అజ్ఞానాన్ని తొలగించిన మాయావి.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన


75.గుడిపాటి వెంకటచలం  విప్లవ కవి.
స్త్రీ వాద రచనలు చేసిన రచయిత.
గుండెలోని అభ్యుదయ భావాల రూపం దాల్చిన కవి
స్త్రీ లో భావ విప్లవానికి నాంది పలికిన విధాత
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

 76 వైశాఖ పౌర్ణమి గౌతమ బుద్ధుడు జన్మదినం
కపిలవస్తు రాజుశుద్దోధనుడు మాయాదేవి ల కుమారుడు
వైవిద్య భావాలకు అద్వైత శుభ దినం
కరుణామయుడు తథాగతుడు బోధి వృక్ష జ్ఞానో ద యు డు
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన


77. బుద్ధం శరణం గచ్చామి సంఘం
చరణం గచ్చామి  బుద్ధుని జ్ఞాన మతము
భువిలో ప్రజలు విదేశీ ప్రజల సంఘం
చరిత్రలో ‌ చిరస్మరణీయ మతం‌
బౌద్ధమతము
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

78. దేశ  విదేశాలలో  పేరు పొందినమతము
కుల మతాలకు అతీత మైన ది
దేదీప్య మై వెలుగుచున్న మతము
కుటిల భావాలకు క్రూర ప్రవర్తనకు కుతంత్రాలకు ‌ అందనిది
తెలుగు కువెలుగు సాహిత్య సృజన

 79.పచ్చని ప్రకృతిలో వసంత వెన్నెల
పసిడి పొలాల్లో ధాన్యం
 కుప్పలు
పదనిసల సంగీత లహరి గీతాల
పదే పదే  పరవశించే గీతాల గానాలు.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన


80.తుషార కోమల  సుగంధ విరులు
సమీరా సుందర పవన  వీచిక
తుళ్ళిపడే యవ్వన యువతి కురులు
 సరాగాల సరస సల్లాపాల గీతిక
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

81.గులాబీల  గుబాళింపు పూల  తోట
చామంతి  పూబంతుల  నిగారింపు వనమంతా
గుల్మహర్ పూల సుగంధ బాట
చారుమతి పూజ కుసుమాలు  గుడి అంతా
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన




82.ఆకాశంలో  సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు
అవని లో ఎందరో  మహానుభావులు మనవారు
ఆరాధ్య దేవతలు మార్గ దర్శకులు.
అనురాగ మూర్తులు ఆత్మీయతకు మారుపేరు.
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన

83.వంగపండు ప్రసాదరావు జననాట్యమండలి  అధ్యక్షుడు
జానపద గీతాలు కళల  పిపాసి
వస్తావా పిల్లా వెల్డమోస్తవ పాట పాడే వాడు.
జానపదుల జీవనానికి జవ కళాసి
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

84. కళా రత్న బిరుదాంకితుడు  వంగపండు
హరిజన గిరిజన ప్రజలకు  జీవనాడి
కవి గా రచయితగా నటుడిగా పేరు పొందినవాడు
హరిహరుని పూజించినవాడు
ఉత్తరాంధ్ర కు అతడే నా
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన.



85.గౌతమ బుద్ధుడు పుట్టిన భూమి.
బౌద్ధమతానికి సరిహద్దులు కుల మతాలు లేవు
గౌరవ ప్రదమైన బుద్ధం శరణం గచ్చామి.
బౌద్ధ భిక్షువు కు తరతమ్య భేదాలు లేవు.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన


86.విశాల భరత ఖండం అద్భుతము
రాచరిక వ్యవస్థకు పేరుగాంచిన  భూమి
విశ్వానికి నాగరికత నేర్పిన  సాంప్రదాయము
రామ రాజ్యం  రవి కుల సామ్రాజ్యం గా విరాజిల్లిన భూమి.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన


87.హిమాలయ పర్వత పంక్తి పెట్టని గోడ 
మానస సరోవర సుందర  తీరము
హిమము తో కప్పబడిన శిఖరనీడ
మానసిక ప్రశాంతి కలిగించే ప్రదేశము
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

 88. తెలంగాణ కోటి రతనాల వీణ
శతకోటి ‌ భావాల ‌ సాహిత్య వాన
తెలుగు భాషకు యాసను నేర్పిన జాణ
శరత్ చంద్రిక లా‌ వెలిగే భావన
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన


89. కాకతీయ వైభవం‌‌ ఓరుగల్లు సామ్రాజ్యము
అంగ వంగ కళింగ రాజ్యాలు
కారణ‌ జన్మల వీరత్వ నిదర్శనము
అలనాటి చక్రవర్తుల కీర్తి శిఖరాలు.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

90.గత కాలపు  రాచ  వైభవ చిహ్నాలు.
నేటి శిల్ప కళా వేదిక అలంకారము
గంధర్వ గాన నాట్య ప్రదర్శనలు
నేల నుండి నింగి కి ఎగసిన సంబరము
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

91. సాహిత్య లోకంలో  ఒక రచయిత్రిగా వర్ధిల్లాలి
కవిత్వ క్షేత్రంలో  కల్పవృక్షమై
ఇవ్వాలి నీడ.
సాధనమున పనులు  సమర్థంగా  నెర వేరాలి
కళలలో రాసేది సృజన తో  రాసే కవి గురజాడ
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

92. స్వచ్ఛమైన సాహిత్యం పది కాలాలు పండుతుంది
ఊహా లోకపు సాహిత్యం ఉనికి ఉండదు.
స్వయంగా సొంతంగా ఆలోచన రాత స్థిరంగా ఉంటుంది
ఊరు లో ‌ ఎన్నో సమస్యలకి పరిష్కారం లేదు.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

93. ముద్ద మందారాలు సుందర కుసుమాలు
భగవానుడి  పూజకు పవిత్ర
మయినవి
మురిపాల ముగ్ధ మందారం ‌ అందాల పుష్పాలు
భవితకు నందన వనాలు కనువిందు లైనవి. 
 తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

94.సాహిత్యానికి సృజన లైన సాహిత్య సృజన
నియమాలు అనుసరించి ని బద్దంగా రాసాను.
సాహితీలోకానికి  వందనాలు అర్పించింది నా రచన
నిష్ణాతురలినై  108 సాహిత్య సృజన లు లిఖించాను.....
తెలుగు కువెలుగు సాహిత్య సృజన


95.. మనిషి సంఘజీవి మనలేడు వంటరిగా
కరోనా గృహ నిర్బంధుడు‌ అయ్యాడు
మనసు వ్యాకులత మదిని చేరింది గా
కళకళలాడే లోగిళ్ళు లో మనిషి
కుతకుత మన్నాడు.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన


96.ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు మాకు కరోనా బాధలు.
కదలలేని కార్య కలాపాల పరిస్థితి
ఎక్కడ ఉన్నారో ముక్కోటి దేవతలు
కరుణించి కటాక్షించి కా పాడాలి ప్రజల స్థితి
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.


97.సర్వేజనా సుఖినో భవంతు అన్నారు
ప్రజలు అంతా సుఖంగా ఉండాలి
లోకాసమస్తా సుఖినో భవంతు అన్నారు.
ప్రజా క్షేమమే ప్రగతి పథం కావాలి

తెలుగుకు వెలుగు సాహిత్య సృజన


98. పూల తోటలో రకరకాల పూలు
పండ్ల తోటలలో ఎన్నో రకాల పండ్లు
పూసే పూల లో భగవంతుని రూపాలు 
పసివాళ్లకు పెడ్డచిన్నలకు శ్రేష్ఠ మైన ఆహారం గుడ్లు
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

99.సాహిత్యానికి సంగీతానికి కవిత్వానికి.. అవధుల్లేవు
చిత్రలేఖనం శిల్పకళ శారదమ్మ వరము
సాయంకాల సమయాన ఆటలకు ఆంక్షలు లేవు
చిరు మువ్వల సవ్వడి లో నాట్యం అమరము
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.

100. అనుదినము ఆశ మనిషిని నడిపిస్తుంది
జీవన యానానికి అదియే గమ్యము
అలసి సొలసిన మనసును సేద తీరుస్తుంది
జీవిత నౌక ను ఆశ  చేర్చుతుంది తీరము
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన
: 101.బంగారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము
ఆనంద వినోదాల   విందుల  జోరు
బతుకమ్మల  బోనాల  పండుగ 
పరవశము
ఆహ్లాదకర  వాతావరణ  సంతోషాల జోరు
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

102.తెలంగాణ తల్లి  సుమధుర  దీవెన
ప్రజల  జీవన ప్రమాణ దీపిక
తెలుగు ప్రజల  ఆత్మీయ భావన
ప్రగతి పథంలో ముందుకు నడిచే హాలిక
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

103.ఉజ్వల  భవిష్యత్తు కోసం  ఈ తరము.
ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నారు.
 ఉషోదయం సంధ్యా సమయం
అనుభవించని వారము
ఉరకలేసే ఉత్సాహం బ్రతుకు లో చూపిస్తున్నారు
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన.



104.తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు
సప్తమ వార్షికోత్సవ వేడుకల వైభవము
తె లుగు  కవితల జిలుగు వెలుగులు.
సరదా కోసం సందడిగా కోలాహలము
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

105.ఎందరో వీరుల శూరుల త్యాగనిరతి

ఆశల ఆశయాల సాధనకు కృషి

ఎన్నో  ఏళ్ల   పోరాట  పరిస్థితి

ఆనంద తిరునాళ్ళ సరదా కుషి

తెలుగు కువెలుగు సాహిత్య సృజన

106.ముప్పై జిల్లాల  మురిపాల
తెలంగాణ
మూడు కోట్ల ప్రజల ఆనంద కేళి
ముచ్చట్లు   అచ్చట్లు   రతనాల వీణ
బోనాలు బతుకమ్మ,బంగారు కేళి.
తెలుగు కువెలుగు సాహిత్య సృజన

107.అంజనీ పుత్రుడు హనుమ జయంతి
రాముని బంటు  లంకకు  చేటు
అతులిత   బల దాముడు సులొచన పతి
రామ నామ పారాయణ ప్రియుడు
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

108.సుందరకాండకు అండగ నిలిచిన భక్తుడు
సంజీవిని పర్వతాన్ని తెచ్చిన ధీర
శుభకరుడు అభయుడు  వీరుడు ధీరుడు
సంకట హరుడు సద్గుణశీలుడ అయిన వానరవీర
తెలుగు కు వెలుగు సాహిత్య సృజన

109.సీత జాడను కనుగొన్న బజరంగబళి
చరిత్రలో చిరస్థాయిగా నిలచిన చిరంజీవి
సీతారాముల ను హృదయములో  నిలుపుకున్న బళాబళి
చర్విత చరణం లా నీ పాదాలే మాకు భావి.
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

0/Post a Comment/Comments