ముత్యాల హారాలు. గుర్రాల.
791)అదిగో బుల్లెట్ బండి.
వచ్చింది చెల్లి చండి
ఆకుకూర తాను వెండి
ఇప్పుడే పడుకుందండి !
792) మందు నీకు పడదు రా
తాగుట మానేయ రా
నోరార చెబుతున్నరా
మానేస్తే మంచిది రా !
793) గీతా ప్రచారం విను
చేయుట కొచ్చింది తాను
ఆమె పేరు ఉదయభాను
ఆ గీతాసారం విను !
794) రైలు దూసుకొచ్చింది.
పొగలు గ్రక్కుతూ ఉంది
వేగాన్ని పెంచుకుంది
స్టేషన్ లో ఆగింది!
795) అది ఒక చెకుముకు రాయి
తీసుకురా నీవోయి
ఆ మూలన వేయవోయి
పోయి రా బొంబాయి !
796) అమ్మ జోల పాడింది
తినమనితాను వేడింది
స్నానం చేయాలంది
నీళ్లను తోడమంది !
797) పొలం జాలువారింది
నీరు అంతట ఊరింది
సేద్యం కష్టంగా ఉంది
పడుతున్నంగ ఇబ్బంది !
798) తొవ్వించావా బాయి
ఉందా లేదా ఆ సోయి
స్పాట్ చూఇస్తానోయి
నీవిక్కడికి రావోయి !
799) కోడిపుంజు తురాయి
నిక్క పొడుచుకుందోయి
కూతకు వచ్చిందోయి
తర్ఫీదు ఇయ్యవోయి !
800) అష్ట శతకం పూర్తి
అయ్యాయి పరిపూర్తి
నే ఉన్నది కల్వకుర్తి
శ్రవనే మాస్పూర్తి!
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్ 9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.