వస్తావుగా ...?
ప్రియతమా...!
దూరమైన నీ రూపం
మన మధ్య వున్న
దూరాన్ని దాటుకుంటూ
నా కనులలో కలగా
అవతరించింది..
మధురమైన
నీ పిలుపును
గాలి తెమ్మెరలు
తీసుకొని వచ్చి
నా హృదయానికి
అందించినాయి
నీ పిలుపులోని
మాధుర్యాన్ని
మననం చేసుకుంటూ
నీ కోసం....
ఆకాసాన నిలిచిన
చుక్కల దీపాలను
లెక్కిస్తూ ఆశగా
నిలుచున్నానిక్కడ
నా ఆశ నిరాశగా మారి
నా గుండెలోని ఆవేదన
అక్రోశంగా మారకముందే
వస్తావుగా...!
--కల్పన దేవసాని