🥀🌸జ్ఞాన ప్రదాత - గురువు🌸🥀
....మణికర్ణిక
చెంత నుండి విద్య చెరగకుండగజేసి
నేర్పు గురువు మనకు నేర్పు తోటి
సకల జగతి యందు సాకారరూపుడై
వెలుగు చుండు యితడు వేల్పు వోలె!!
బడిని గుడిగ దలచి బడిపంతులుగతాను
అవతరించె చూడు నవని యందు
నిజము తెలుసు కొనియు నిజరూప దైవాణ్ణి
కొలిచి నంత జ్ఞాన కోర్కె లమరు!!
తిరుగు తుండు చూడు త్రీమూర్తి రూపుడై
విద్య నొసగ గురువు వీను లలర
మంచి గురుని జేరి మరువక మనమంత
బోధ లంద వలయు పొందు గాను!!
.......✍️మణికర్ణిక🌹☘️
శ్రీ.వడ్ల.నర్సింహా చారి,
భాషోపాధ్యాయులు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శేరిలింగంపల్లి,
రంగారెడ్డి జిల్లా.
చెంత నుండి విద్య చెరగకుండగజేసి
నేర్పు గురువు మనకు నేర్పు తోటి
సకల జగతి యందు సాకారరూపుడై
వెలుగు చుండు యితడు వేల్పు వోలె!!
బడిని గుడిగ దలచి బడిపంతులుగతాను
అవతరించె చూడు నవని యందు
నిజము తెలుసు కొనియు నిజరూప దైవాణ్ణి
కొలిచి నంత జ్ఞాన కోర్కె లమరు!!
తిరుగు తుండు చూడు త్రీమూర్తి రూపుడై
విద్య నొసగ గురువు వీను లలర
మంచి గురుని జేరి మరువక మనమంత
బోధ లంద వలయు పొందు గాను!!
.......✍️మణికర్ణిక🌹☘️
శ్రీ.వడ్ల.నర్సింహా చారి,
భాషోపాధ్యాయులు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శేరిలింగంపల్లి,
రంగారెడ్డి జిల్లా.