ఆడపిల్ల...... --వాణి రమేష్ (మీను)

ఆడపిల్ల...... --వాణి రమేష్ (మీను)

మా  ఇంటి ఆశల ప్రతి రూపం నువ్వు.....
అమ్మ నాన్న కలలకు దీపం నువ్వు.....
ఉదయిస్తున్న అరుణ కాంతుల  వెచ్చటి వెలుగువి నువ్వు.....
మా అందరికి అపురూపం నువ్వు....నీ నవ్వు....
అమ్మ నాన్న ల  ఆలోచనల కి అడుగువి..నువ్వు

ప్రతి నిమిషం.....ప్రతి విషయం.... లో.. 
ఆప్యాయత ను అందించే అదృష్ట దంపతులకు  అరుదైన కానుక నువ్వు.....
అనురాగపు రాగనివి.... ఆత్మీయత స్వరానివి నువ్వు..
 
అమాయకపు ఆలోచన లో నువ్వు.....నీ చెదరని  చిరునవ్వు .....
అలాంటి నిన్ను చూస్తూ  అలా ఉండిపోతాము మేము ఉన్నంత  కాలం....
మా ఆశల పంటవైన  నువ్వు..

 చిరంజీవి గాఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ
.... నీ ప్రాణం లో నా సగ ప్రాణం ఉందని.... భావిస్తూ...
ప్రేమతో....

--వాణి రమేష్ (మీను 🖊️కలంపేరు )

హ్యాపీ డాటర్స్ డే
బుజ్జి తల్లులు love u all🌹

0/Post a Comment/Comments