75వ స్వాతంత్ర్య దినోత్సవo సంధర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 7రోజుల పాటు ఆన్లైన్ ద్వారా జాతీయ స్థాయిలో స్మరిద్దాం ఈవేళ పేరిట నిర్వహించిన పాటల పోటీలు మరియు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వీరుల గురించిన ప్రసంగం పోటీలలో పాల్గొని ద్వితీయ బహుమతి పొందటం జరిగింది.
ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ , ఐఐటి విద్యాలయ సభ్యులు చుక్కా రామయ్య , హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మక్కపాటి మంగళ గార్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగగా వేలాదిమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్నవారు మరియు వివిధ రాష్ట్రాలలో ఉన్నవారు దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఇందులో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులపై గానం చేయడమే కాకుండా స్వతంత్ర సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను కాపాడుటకు తన భర్తనే చంపిన నీరా ఆర్య మరియు తెలుగునాట బ్రిటీష్ తొత్తులు భూస్వాముల మెడలు వంచిన గున్నమ్మ గార్ల గురించి వివరించడం జరిగింది.