56 అక్షరాల ఆత్మీయత తెలుగు అంతులేని పద జ్ఞానపు సంపద నా తెలుగు
అమ్మ ఒడిలో కమ్మనైన లాలిపాట తెలుగు,విరబూసిన పుష్పాల పద భావం నా తెలుగు
ఆదరణ కరువు అయ్యేనా నేడు నా తెలుగు కు, అవధరించ కలం కలిపే నా హృదయం నేడు
జగతిని తరింపజేసే భాష నే
నా తెలుగు, నిన్ను నీలో తరింపజేసే అమృతమే తెలుగు
కన్నడిగుడు కృష్ణ రాయుడు తెలిపిన సత్యము, కవి సుబ్రమణ్య భారతికి సుందరమై తోచిన సత్యం, గిడుగు వారి పాండిత్యం వెలుగు తెలుగు.
నిగూఢమైన నా అర్ధాల నిధి యే నా తెలుగు, ఉగ్గుపాల తీయదనము అమృతమే తెలుగు
శ్రావ్యమైన సుస్వరాల తన్మయ మే నా తెలుగు , కవుల కలపు సొగసులదిన పదకోశం తెలుగు
పర భాషకు అభిషేకం చేయకురా సోదర, మాతృభాషపై మమకారం మరువకురా సోదర
అమ్మ లోని కమ్మదనం మాధుర్యం తెలుగు రా, విజ్ఞానపు వీధులలో పరభాష మోజులో, పుడమి తల్లి పులకరించే తెలుగు మరచిపోకు..
రా...
గాయమైన అమ్మ అంటూ పలికే ఓ సోదరా, మన తెలుగు తల్లి గుండె కు గాయం చేయకు రా
బాధలో వేదనయిన, ఆనందపు చిందులు అయిన,
పద్యమైనా వచనమైన
కవిత యిన ,కావ్యమైన రాగమయిన అనురాగమయిన,భావాలకు ప్రాణం పోయే భాష మరువబోకురా
తెలుగు వెలుగులు జగతిన పంచి ప్రేమ అక్షరాల మాల ధరించి ఆ తెలుగు భావాలు చినుకులలో తడిసి పరవ సిద్ధము
హృదయం నిండుగా భావాల పండగ గలగలపారే సెలయేటి రాగమై సాగిపోదాం కవిత ఉత్సవ అక్షరాల సందడి చేస్తూ
రచన : ఇడుకుల్ల గాయత్రి