గురువు-కల్పతరువు
--------------------------
--------------------------
కనిపించే దైవము
ధరణి యందున గురువు
బ్రతుకుల్లో దీపము
విజ్ఞాన కల్పతరువు
ఉదయించే సూర్యుడు
భువిని ఉపాధ్యాయుడు
శక్తియున్న యోధుడు
నడిపించు నాయకుడు
చూపుతాడు మార్గము
దిద్దునోయ్! జీవితము
అసమానము త్యాగము
గౌరవింప భాగ్యము
అజ్ఞానము తరుమును
విజ్ఞానము పంచును
మంచితనము పెంచును
గురువు విద్య నేర్పును
--గద్వాల సోమన్న,
గణితోపాధ్యాయుడు,
కర్నూలు జిల్లా