అక్షరాస్యత - విలువ
....ఐ సత్య
....ఐ సత్య
ఏమిటీ అక్షరాస్యత..
రాయడం..చదవడమేనా?!
పొరపాటు...పొరపాటు..!!
విను...చదువు... రాయి...నేర్చుకో...!!!
ఇది అక్షరాస్యతకు అసలైన అర్థం.
ఒక మట్టి ముద్దను మనిషిగా మలిచేది అక్షరాస్యత...
ఎంతో గొప్ప ఉన్నత విద్యాశిఖరాలను
అవలీలగా ఎక్కించేది అక్షరాస్యత...
సంస్కార కోణాలను చూపించి,
విశ్లేషణా శక్తిని ప్రసాదించింది,
సమాజంలో నీ ఉనికినీ
నీ విలువను పెంచేదీఅక్షరాస్యత...!!!
చదువనే విత్తనాలను వేయి నీ మెదడులో...
జ్ఞానమనే మొలకలుగా ఎదిగి,
విజ్ఞానమనే ఫలాలని,
వికాసమనే పూవులను నీకందిస్తాయి...
ఆ విజ్ఞానమే వృక్షమై నిన్ను నడిపిస్తుంది
సంస్కారమనే చల్లటి నీడ వైపు...
వెలిగించు ఒక్క అక్షర జ్యోతిని అది కోటి కాంతులతో
ఎంతో మందికి వెలుగు పంచుతుంది జ్ఞాన జ్యోతి అయ్యి
నీవు నేర్చిన...నేర్పిన అక్షరాస్యతే
నీ ఉన్నత విలువలకు
నిలువెత్తు తార్కాణం...!!!
చదువనే విత్తనాలను వేయి నీ మెదడులో...
జ్ఞానమనే మొలకలుగా ఎదిగి,
విజ్ఞానమనే ఫలాలని,
వికాసమనే పూవులను నీకందిస్తాయి...
ఆ విజ్ఞానమే వృక్షమై నిన్ను నడిపిస్తుంది
సంస్కారమనే చల్లటి నీడ వైపు...
వెలిగించు ఒక్క అక్షర జ్యోతిని అది కోటి కాంతులతో
ఎంతో మందికి వెలుగు పంచుతుంది జ్ఞాన జ్యోతి అయ్యి
నీవు నేర్చిన...నేర్పిన అక్షరాస్యతే
నీ ఉన్నత విలువలకు
నిలువెత్తు తార్కాణం...!!!