బడిగంటలు మ్రోగిన వేళ... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

బడిగంటలు మ్రోగిన వేళ... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

బడిగంటలు మ్రోగిన వేళ...

బడిగంటలు మ్రోగిన వేళ...
అందరి హృదయాలలో ఆనంద హేల...
అందుకే గురువులారా ! గుర్తుంచుకోండి!

మీ చేతుల్లో...
బుక్సున్నాయి బోధించేందుకు...
బెత్తాలున్నాయి శిక్షించేందుకు...

మీ చేతిలో...
మట్టి ముద్దలు సిద్దంగా ఉన్నాయి...
కావడిలో కుండలుగా మారేందుకు...

మీ చేతిలో...
చిరుదివ్వెలున్నాయి చిమ్మ చీకటిని...
చీల్చి వెలుగులను విరజిమ్మేందుకు...

మీ చేతుల్లో...
ఉలులున్నాయి ఎన్నో శిలలున్నాయి...
సుందరమైన శిల్పాలను చెక్కేందుకు...

మీ చేతుల్లో...
ఎదిగే అమాయకపు పిల్లల బంగారు...
భవిష్యత్తులు‌న్నాయి తీర్చిదిద్దేందుకు...

మీ చేతుల్లో...
విరిసీవిరవని మొగ్గలున్నాయి గుబాళించే...
పూలున్నాయి పూజకు సమర్పించేందుకు...

గురువులారా!గుర్తుంచుకోండి !
మీరే వారికి మార్గ నిర్దేశకులు...
మీరే వారికి కనిపించే దైవాలు...
మీరే వారికి కనని అమ్మానాన్నలు...

గురువులారా! గుర్తుంచుకోండి!!
మీ విద్యార్థుల్ని, వీరులుగా శూరులుగా
రాళ్ళలో రత్నాలుగా, మట్టిలో మాణిక్యాలుగా
భావిభారత పౌరులుగా, భరతమాత ముద్దుబిడ్డలుగా
తీర్చిదిద్దే బాధ్యత మీదే, తీరని మీ గురువుల ఋణం
తల్లిదండ్రులఋణం తీర్చుకునే బాధ్యత విద్యార్ధులదే

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
 

0/Post a Comment/Comments