షాయిద్ - భగత్ కు నీరాజనం
భగత్ సింగ్ పేరు వింటేనే దేశభక్తుల
నరనరాల్లో ఉద్వేగం పొంగుతుంది
మూడేళ్ళ ప్రాయంలోనే గడ్డిపరకల మొక్కలను..
తుపాకులుగా నాటిన చిరు ప్రాయ వీరుడు.
నౌ జవాన్ భారత్ చేరి యువకుల్లో
దేశభక్తిని నింపిన విప్లవ వీరుడు
మహాత్ముని సహాయ నిరాకరణ
ఉద్యమానికి ప్రభావితుడైన దేశభక్తుడు
మేరా రంగ్ దే బసంతీ అంటూ విప్లవ గీతాలు.. ఆలపించిన విప్లవోద్యమ యువకుడు.
జైలు గోడల నడుమ స్వాతంత్ర ఉద్యమ
కెరటాలను ఉప్పెనలా ఎగిసిపడేసిన ధీరోదాత్తుడు
ఇంక్విలాబ్ జిందాబాద్ అని
నినదించిన షాయిద్ ఈ ఆజామ్
63 రోజుల నిరాహార దీక్ష ఫలితమే
ఖైదీల సమస్యలకు ముగింపు.
మార్క్సిస్టు నాస్తికుడు భగ్- సింగ్ దేశభక్తుడే
సట్లెజ్ నది తీరంలో మీ స్మృతి చిహ్నం
భారతీయుల్లో చెరగని ముద్ర
చిరుప్రాయంలోనే స్వాతంత్ర ఉద్యమంలో
అమరుడైన భగత్ సింగ్ అక్షర నీరాజనాలు.
---ఇమ్మడి రాంబాబు