మధ్య తరగతి మనిషి
మానవతా విలువలు నమ్మిన మనిషి
ఓ మధ్యమ మనిషి
విలువలను విడవ లేని మనిషి
కట్టుబాట్ల కౌగిటిలో ఉన్న మనిషి
కష్టాల కడలిలో సాగే నీ జతి
అవతల ఏమో ఆశల తీరం
ఇవతల ఏమో అప్పుల భారం
తెల్లవారితే భయం భయం
బతుకు పోరుకై రణం రణం
అత్తేసరు సంపాదనతో
అరకొర సాగే బతుకు బండి
సమస్యల సుడిగుండం చుట్టూ ఉన్న
నీ ఆశల అల ఊతమిస్తూంటే
నల్లేరుపై నడకలా సాగుతున్న జీవితాన
నలిగి పోక పట్టు విడవక సాగిపో
ఆకాశాన్ని అందుకోవాలనే కెరటమై
అడుగు అడుగున పైకి లే
రక్తాన్ని స్వేదం చేసి
అవకాశాన్ని అందిపుచ్చుకొ
విశ్వాసంతో ముందడుగు వేసి
శ్రమ యే ఆయుధం గా
పూలబాట పరుచుకుని
చేరుకో ఆవలి తీరానా ఆశల సౌధాన్ని.