పరిశరాలు - జీవుల బ్రతుకుతీరు ---వి. కృష్ణవేణి

పరిశరాలు - జీవుల బ్రతుకుతీరు ---వి. కృష్ణవేణి


బాలగేయం

పరిశరాలు  - జీవుల బ్రతుకుతీరు

వనములోన మయూరాలు నాట్యము ఆడుచున్నవి.
కోయిలలు కుహుకుహు రాగాలు పాడుచున్నవి.
అడవులను నరకవద్దని జంతువులు  వేడుచున్నవి.
కూటికోసమే వలస పక్షులు స్థానికాన్ని  వీడుచున్నవి.

సమాజంలో ప్రజలబ్రతుకులు మారుతున్నవి.
లోకంలో కుర్రకారు బుద్దులుహద్దులు  మీరుతున్నవి.
వీధుల్లో పారిశుద్యకాలువలు నిండి పారుతున్నవి.
 స్వచ్చంద సంస్థలు ప్రభుత్వచేయూతను  కోరుతున్నవి.

 పక్షులన్నీఒకచోట గుమి కూడుతున్నవి.
ఎండవేడికి వనములన్నీ వాడుతున్నవి.
ఆకలితో జంతువులు మలమలా మాడుతున్నవి.
లోకంలో ప్రజల పాపాలు మూడుతున్నవి.

సాయంసంధ్యావేళలో పక్షులన్నీ గూటికి చేరుకున్నవి.
రెక్కలొచ్చిన పక్షులు తల్లివడిని వీడి మెల్లంగా జారుకున్నవి.
 జడివానలో రెక్కలుతడిచి పక్షులు ఎగరలేక  ఊరుకున్నవి.
ఎన్నిమారిన పర్యావరణ కలుషితపరిస్థితులు మారకున్నవి.

---వి. కృష్ణవేణి
వాడపాలెం.

 ప్రక్రియ :వచనం.

0/Post a Comment/Comments