తత్వం --పసుమర్తి నాగేశ్వరరావు, టీచర్, సాలూరు.

తత్వం --పసుమర్తి నాగేశ్వరరావు, టీచర్, సాలూరు.

తత్వం

ఏదైనా ఏమైనా 
ఎలాగైనా ఎవరిదైన
నీదైనా నాదైన
అది నాదేనని
నీదికాదని

నాదైన నా తత్వం తో
నీ తత్వాన్ని కాదని
నా తత్వమే ఉత్తమత్వమని
నీ తత్వం ఉత్తుత్తిదేనని
ఉత్తుత్తినే 
పొత్తులేనితత్వం తో

పొడితత్వం గల 
మనస్తత్వం తో
ఉన్నతత్వం తో కూడిన
నైతికత్వపు విలువలును
మూర్ఖత్వం తో
మూఢత్వం తో 
అణచివేతతత్వం గలవారిని

 సత్వరం కాకపోయినా
ఆ తత్వ నైజత్వాన్ని
గుణతత్వాన్ని
ఉన్మాదత్వాన్ని
దైవత్వమే

కాలతత్వం మేరకు
నీచత్వబుద్ధితత్వం గలవారిని
తాత్వికత అర్ధం కాకపోయినా
సాత్వికులు గా 
మార్చే మానవత్వ మనుషులను
సృష్టించి 
భవితవ్యానికి
భగవంతుడే బాట వేస్తాడు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
           సాలూరు


0/Post a Comment/Comments