ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా
భారత రత్నం - మోక్షగుండం
మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు
కర్ణాటక ముద్ధనహళ్ళి లో జననం
జన చైతన్య ఉత్తేజభరిత ప్రసంగం
ఇంజనీరు గా అఖండ కీర్తిని గడించిన మోక్షగుండం
నిష్కామ దేశ భక్తుడిగా మహనీయ శిఖరం
నేటి తరం యువతరానికి వారొక దిక్సూచి
గణితంలో అసమాన ప్రతిభలో ఆయనే మేటి
రంగాచార్ల వారి ప్రోత్సాహంతో విద్యాబ్యాసం
ఆంగ్లేయుల పాలనలో అచ్యున్నత పదవీ స్వీకారం
ప్రపంచ జలాశయం సింధు రాష్ట్రం నిర్మాణం లో కీలకం
భారత రత్న బిరుదుతో ప్రభుత్వ సత్కారం
వేల ఎకరాలను సస్యశ్యామలం చేసిన ఘనులు
స్వదేశీ సంస్థాన ప్రజల కోసం గళం విప్పిన ధీరులు
నీతి నిజాయితీలలో వారికి వారే సాటి
సత్కారాలు,పురస్కారాలలో వారికి ఎదురు లేదు
జీవితం దేశ ప్రగతికి అంకితం చేసిన ధన్యులు
దేశ పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసిన కర్తవ్య దీక్షులు
అంతా తలరాత అనే అలసత్వ భావం రూపు మాపమన్న కృషివరలు
గురు శిష్యుల అనుబంధంలో ఎన్నో ఎత్తులకు ఎదిగిన ఆదర్మమూర్తులు
మనిషి మేదస్సుతో అద్భుతాలు సృష్టించిన అంకిత భావులు
మానవాళికి ఎంతో మేలు చేసిన మేధో సంపన్నులు
నిజాం నవాబులు కూడా ఆశ్చర్య పోయిన వీరి మేధో తపస్సుకు వందనాలు
100 సంవత్సరాల పూర్తి సంపూర్ణ ఆరోగ్య జీవనం గడిపిన మహోన్నతులు, ధన్యులు
దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
15/09/2021
బుధవారం