వామనామృతం --విస్సాప్రగడ పద్మావతి

వామనామృతం --విస్సాప్రగడ పద్మావతి


అంశం: *శ్రీ వామన జయంతి*
శీర్షిక : *వామనామృతం*

బాల భానుడి తేజం 
బాల హనుమ ఉత్తేజం
కలగలిపిన హృదయుడు
మన వామనుడు

చత్రం ధరించి
పిలక రూపియై 
పంచెకట్టుతో 
దొడ్డి కాళ్లను కలిగి 
బుడిబుడి అడుగులతో
వెలసిన రాక్షస సంహారి

సూక్ష్మ బుద్ధితో 
బలవంతులను 
మట్టుపెట్టే శక్తిశాలి
 
మూడు అడుగులతో
ముల్లోకాలనూ ఆక్రమించిన
మహా అద్భుత శక్తి నీ వశం


బలి చక్రవర్తిని 
పాతాళానికి తొక్కి 
రాక్షసుల స్థానం చెప్పకనే చెప్పి
మానవజాతికి అండగా
నిలిచిన బుజ్జి బంగారయ్య
మన వామనయ్య

హామీ పత్రం
 మీ రచన నా స్వీయ రచన.
 అనుకరణ కాదు.

పేరు
విస్సాప్రగడ పద్మావతి
 హైదరాబాద్

0/Post a Comment/Comments