వెనకబడిన చదువులు --తాళ్ల సత్యనారాయణ

వెనకబడిన చదువులు --తాళ్ల సత్యనారాయణ

కరోనా కాలమందు
ఆన్లైన్లో బోధన
కనుమరుగాయేను
విద్యార్థుల సాధన
మొబైల్ ఫోన్ మోజులో
వెనుకపడిరి విద్యలో.

ఇంటర్నెట్ వలలో
చిక్కుకున్న ముప్పు
ఎప్పటికప్పుడు చెక్
చేయకున్న తప్పు
మాయచేయు నెట్
మానకుంటే చేటు

సెల్ఫోన్ చేతికిచ్చి
చూడకుంటే ముప్పే
పిల్లల గ్రహించకున్న
తల్లితండ్రుల తప్పే
పరీక్షించే కరోనా
పాడు చేస్తుండేనా

ఆన్లైను తరగతులని
సెల్ఫోన్లో క్లాసులు
తప్పవాయె అనవసర
వెబ్సైట్ ల తిప్పలు
పనుల్లో పెద్దలు
చెడువైపు పిల్లలు

ఆన్లైను చదువులంటు
పిల్లలు చరవాణిలో 
విషయమే అర్థమవక
వెనుకపడిరి చదువులో
ఆటలంటే మోజులు
రుచించవాయె చదువులు

--తాళ్ల సత్యనారాయణ
హుజురాబాద్.

0/Post a Comment/Comments