నిర్వేదం... ఎన్. రాజేష్

నిర్వేదం... ఎన్. రాజేష్



         నిర్వేదం
==============

ఏదో తెలియని నిర్వేదం
ఆవహించినది ఈదినం
మనసంతా ఆలోచనలమయం
అనుక్షణం ఏదో కలవరం
ప్రతిక్షణం భయం భయం
గత అనుభవాల భయం
అనవసరపు ఆందోళనం
ప్రస్తుత జీవనం అంధకారం
భవిష్యత్తు కోసం పోరాటం
బతుకునెలానెట్టుకరావాలని ఆరాటం
ఏదో సాధించాలని తాపత్రయం
ఇంకా ఏదీ సాధించలేదని
నిర్వేదం! 
         
ఎన్. రాజేష్ (కవి, జర్నలిస్ట్)
సరూర్ నగర్, హైదరాబాద్.
వచన కవిత్వం.

0/Post a Comment/Comments