మనిషి జీవనంలో కోరికలు
కోకొల్లలు
కొన్ని తీరేవి..తీరనివి కొన్ని
మనవమనుగడకి ముఖ్యావసరాలు.ఆహారం,ఆవాసం,వస్త్రం...
వీటితో ఏ మనిషి సంతృప్తి చెండలేడు...
చెందితే అంతరిక్షంలో అడుగు
పెట్టలేడు..
జీవనసమరంలో పోరాడాలి
విజయాన్ని పొందాలి
విద్య లో లేదు తృప్తి
వస్తువుల్లో లేదు తృప్తి
యాంత్రిక జీవనం లో లేదు తృప్తి...
సాధించాలి జీవితంలో
సహకరించాలి అందరికీ
వేయిలో ఒకరిగా కాదు
పదిమందిలో ఒకరిగా
యువత ఒరవడి ఇది
ఇది ఆరోగ్యపోరాటం
కాని లేదు కృషి
లేదు కష్ట పడే తత్వం
సులభం గా సంపాదించాలి
అదే మంచిమార్గం....
సాధిస్తున్నారు..అనుభవిస్తున్నారు...
అయినా సంతృప్తి లేదు
ఇంకేదో చేయాలి...ఆకాశానికి
నిచ్చెనలు వేస్తారు
అందలం ఎక్కలేక అలసి
తృప్తి లేని జీవితం లో సంతృప్తి
ని కోల్పోతున్నారు....
తనకున్న దానితో సంతృప్తితో
జీవించేవాడు మనిషి....
నేడు మనిషి అల్లకల్లోల మనస్తితిలో సంతృప్తి లేక శాంతిని కోల్పోతున్నారు....
సంతృప్తితో సర్వము జయము...
పేరు:శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు: హైదరాబాద్
చరవాణి:9490239581