పసలేని ప్రాసలు
----------------------
మల్లె మొగ్గలు తెల్లన
పాపం నడక మెల్లన
నీ బుగ్గ నేను గిల్లన
వెన్నెలేమో చల్లన!
అదిగో స్వస్తిక్ గుర్తు
కరెంటు అవుతది అర్తు
అక్కడుందిలే ఓ బెర్తు
నీ అక్కరఇక నే తీర్తు!
చల్లని నీరే త్రాగు
ఉయ్యాల నీవు ఊగు
ఆ ఊయల గంట మ్రోగు
ముందుకు నీవిక సాగు!
ముందుంది అగ్నిగుండం
వెళ్లి పెట్టు నీవు దండం
తప్పిపోవు నీ గండం
విన్నావా కోదండం!
గంధం మెడకు రాయి
ఎంత చక్కని కనుదోయి
అసలు ఉందా నీకు సోయి
పక్కనే ఉంది రా బాయి!
చీమలు పెట్టును పుట్టలు
ఎక్కకు నీవు గుట్టలు
మోస్తున్న వుగా తట్టలు
కాల్చకురా ఇక చుట్టలు!
సరిగ్గా పెట్టు పైపు
కొయ్యరా మూతి వైపు
ఒకసారి నాకు చూపు
సరిపోయింది దాదాపు!
జాతి వైరం వద్దు
కలిసి ఉంటే ముద్దు
తెలుసుకో ఈ పొద్దు
ఇక నీవు రావద్దు!
అదిగో టీవీ రిమోట్
లేదుగా ఆ కరెంట్
ఆపేసి రా నీవిటు
పోవద్దు రా నీవటు!
పైపు సరిగా ఇరికించు
ఆ వైపు దూరాన్ని పెంచు
సరిగా చూడు దాని అంచు
గమ్ ముక్కల నీవుదంచు
ఎందుకురా నీకు తాపం
ఎరుపు రంగు ఎద్దుకు కోపం
మా పాప మాఇంటికి దీపం
తొలగిపోవులే ఇక మా శాపం !
గురి చూసి కొట్టు బాణం
పట్టింది గా ఇక గ్రహణం
చదువు నీవు రామాయణం
పుచ్చుకో ఇక వాయనం !
తీసుకో ఉంగరం
వేసుకో సవరం
చేసుకో సింగారం
ఏమంటావు బంగారం!
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్, 9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.