గుర్రాల ముత్యాల హారాలు.తే.23-8-21 ముత్యాల హారాలు.
801) ప్రభుత పన్నుల మంట
తెచ్చిందిలే ఇక తంట
కనిపెట్టు నీవు కంట
పోరుకై కదులంట!
802) పన్నులు వేస్తున్నరు
ప్రాణాల తీస్తున్నరు
ఊపిరి తీస్తున్నరు
గొంతులు కోస్తున్నరు!
803) ఎక్కువ తక్కువ చేస్తు
వారు జనాన్ని దోస్తు
జబర్దస్త్ చేస్తు శిస్తు
గుంజుతున్నరు మస్తు !
804) మా యజ్ఞం మొదలయ్యింది
మా ముందు జన ముంది
మాకు ఊపిరాడకుంది
మేము పడ్డాం ఇబ్బంది !
805) పుట్టుమచ్చ వీపు పైన
చూసావా నీవైన
నాకు ఇస్తావా దీవెన
నీవు చెప్పు ఓ వదిన !
806) రామరాజు వచ్చిండు
రామచిలక తెచ్చిండు
చేతికి అందించిండు
ఆనందం పంచిండు !
807) అలకలు నేర్చిన వాడు
సైగలు చేస్తున్నాడు
మూగ గానే చూస్తుండు
మాటలను దాస్తుండు !
808) మరక మంచిదే అంటడు
కడగకనే తానుంటడు
విడిగానే తింటుంటడు
మాతో కలిసి ఉంటడు !
809) కులికింది రామచిలుక.
ఎందుకు నీకు అలుక
తీసుకో ఈ పలుక
రాసుకోరా నీవిక !
810) ఓం ఓం అని పలుకురా
రాం రాం అని పిలువురా
ఆ దేవుడిని కొలవరా
సాక్షిగాను నిలువురా !
811) రఘువంశ రామయ్య
యదువంశ కృష్ణయ్య
మా దేవుళ్ళు వారయ్య
మేము పూజిస్తామయ్య !
812) ఉమ్మడి మీద తాళి
గుమ్మం పైన ధూళి
చూడమ్మా ఓ రవళి
వస్తున్నాడులే మురళి!
812) పవిత్రమే తాళిబొట్టు
నీవు తెలుసుకొని కట్టు
తలపైన బెల్లం పెట్టు
జనంకు తాళి చూపెట్టు !
813) ఇటు వస్తావా నువ్వు
తీసుకో మల్లెపువ్వు
ఎందుకురా ఆ నవ్వు
చేసుకోరా ఇక లవ్వు !
814) ఆమె చిలకల కొలికి
తొడుగు ఉంగరం చేతికి
తీసుక పో ఇక గుడికి
మళ్ళి రండి ఈ వాడకి !
815) ముందు దండం పెట్టు
సందూకు తెరచిపెట్టు
సొమ్ము దాచిపెట్టు
చెప్పకు దాని గుట్టు !
816) మల్లెపూలు పట్టుకురా
నలిగేలా ముట్టకురా
ఇక చేతికి చుట్టకురా
పళ్లెంలో పెట్టుకురా !
817) సూది బెజ్జం లో దారం
పట్టిందా నీకు జ్వరం
అదిగో తాడు బొంగరం
తిప్పు నీవు వేగిరం!
818) గిల్లికజ్జాలు వద్దురా
కలిసుంటే ముద్దురా
తెలిసిందా సిద్దురా
మొద్దువు కావొద్దురా !
819) పొద్దు పోనీ చిన్నోడు
సద్దుమణిగి ఉన్నడు
తాను పలకకున్నడు
వేధిస్తూనే ఉన్నడు !
820) అక్క మొగుడు వచ్చిండు
చుక్కల చీరలు తెచ్చిండు
ఇంటిల్లాదికి పంచిండు
ఇక ఫోటోలు దించిండు !
821) అది చాకుపీసు పొడిరా
మతిపోయి తినకురా
అక్కడి నుండి ఇటురా
ఇస్తాను నేనుస్వీటురా .
822) చెట్టు విరిగి పోయింది
పిట్ట ఎగిరిపోయింది
గుట్ట కూలి పోయింది
మట్టి నేల పాలయింది !
823) ఇవిగో కొబ్బరి మొక్కలు
అవిగో మల్లె మొగ్గలు
అవేరా కొత్త రగ్గులు
పైన ఉన్నవి జగ్గులు!
824) రాత్రి పగలు నిద్ర
వద్దురా మొద్దు నిద్ర
నా మాట విని చంద్ర
నడుచుకో నీవు ఇంద్ర!
825) అదిగో చీమలదండు
దులపరా ఇక దిండు
తర్వాత నీవు పండు
అప్పుడే మంచిగుండు !
826) గట్టున దూడ మేస్తుంది
ఆవు పాలు ఇస్తుంది
గడ్డి గూడ మస్తుంది
రెడ్డమ్మ కోస్తుంది !
827) తూము తీసి చూడరా
అడ్డము ఏముంది రా
నీకు కనిపిస్తుందా రా
టార్చి వేసి చూడరా !
828) కనిపిస్తుంది పానవట్టం
తీసుకురా ఆ గొట్టం
చేయాలి రా కట్టం
కడతారు నీకు పట్టం!
829) గేటు పైన ఉంది బల్లి
గోడపై ఉండింది పిల్లి
అదిరింది పైడితల్లి
విన్నావా ఓ చెల్లి !
830) దీపం కొండెక్కింది
దీప జేజకు మోక్కింది
వత్తి చేతికి చిక్కింది
వాసనేసి కక్కింది !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్ 9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.