X, IX Telugu FL Assessments (FA,SA)

X, IX Telugu FL Assessments (FA,SA)


9, 10 తరగతుల  తెలుగు - మూల్యాంకనం


10/10 కొరకు సూచనలు


1. కవి పరిచయం- పాఠం పేరు, రచయిత పేరు, రచనాశైలి, పాఠ్యాంశ స్వీకారం, విశేషాంశాలు గుర్తుంచుకోవాలి.

2. ప్రక్రియ పరిచయం- పాఠ్యాంశం ఏ సాహిత్య ప్రక్రియకు చెందిందో తెలిపి ఆ ప్రక్రియ లక్షణాలను తెలపాలి.

3. కంఠస్థ పద్యాలు- పువ్వుగుర్తుగల పద్యాలు కంఠస్థం చేయాలి. పద్యాలను పాదభంగం లేకుండా రాయగలగాలి. పద్యాల ప్రతి పదార్థం, భావం సొంతంగా రాయాలి.

4. పదజాలం- సొంత వాక్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, నానార్ధాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్త్యర్థాలు చదవాలి మరియు గుర్తుంచుకోవాలి.

5. వ్యాకరణాంశాలు- సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు, కర్తరి కర్మణి వాక్యాలు, సామాన్య, సంయుక్త,  సంశ్లిష్ట వాక్యాలు మరియు ప్రాచీనం నుండి ఆధునిక వచనంలోకి మార్చడం. ఇవి తప్పకుండా నేర్చుకోవాలి.

6. ఉపవాచకం- ఏ కాండంలో కథ ఎంతవరకు ఉంటుందో గుర్తుంచు కోవాలి. కథను సొంతంగా, సంక్షిప్తంగా రాయగలగాలి.

7. పద విజ్ఞానం- పుస్తకం చివరన ఉండే భాగం పూర్తిగా చదవాలి. గుర్తుంచుకోవాలి.

8. శతకాలు- పాఠ్య పుస్తకంలో లేని కొన్ని శతకాలు వాటి రచయితల పేర్లు, మకుటం, పద్యాలలోని పదాల అర్థాలు, భావాలపై అవగాహన కలిగి వుండాలి.

9. సృజనాత్మక అంశాలు- సంభాషణ, లేఖా రచన, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, వ్యాసం, కరపత్రం, సన్మాన పత్రం/అభినందన పత్రం, నినాదాలు తయారుచేయడం, గేయ రచన, వర్ణన మొదలైనవి రాయగలగాలి.

10. సారాంశాలు- అన్నిపాఠ్యభాగ సారాంశాలు సొంతంగా రాయగలగాలి.


* ఒక అకాడమిక్ ఇయర్ లో నాలుగు FAలు, రెండు SAలు ఉంటాయి.

ఒక్కొక్క FA 20 మార్కులు. SA 80 మార్కులు. మొత్తం 100 మార్కులు

నాలుగు FAల మార్కులు 80... వీటిని 20కి లెక్కిస్తారు. ఈ మార్కులు పబ్లిక్ పరీక్షలో వచ్చే మార్కులతో కలుపుతారు.

FA =   20 Marks (Internal)

SA =   80 Marks (External)

  Total =  100 Marks (Final Result)

Minimum Pass Marks: 35/100

Compulsary Pass Marks in SA: 28/80 (then 7 Marks need from FA)




__________________

నిర్మాణాత్మక మూల్యాంకనం (Formative Aassessment)


20 మార్కులు

  1. పుస్తక సమీక్ష (Book Review)      -  5మార్కులు

  2. రాత అంశాలు (Written work)   -  5 మార్కులు

  3. ప్రాజెక్టు పని (Project Work)       -  5 మార్కులు

  4. లఘు పరీక్ష (Slip Test)                 -  5 మార్కులు


పుస్తక సమీక్ష, ప్రాజెక్ట్ పని రాసే విధం


పుస్తక సమీక్ష


1. ప్రాథమిక సమాచారం

a. పుస్తకం పేరు

b. రచయిత పేరు

c. ప్రక్రియ

d. సమీక్షకుల పేరు

e. తరగతి-సెక్షన్

f. మీడియం

g. క్రమ సంఖ్య

2. నివేదిక 

3. ముగింపు


ప్రాజెక్ట్ పని


1. ప్రాజెక్టు పని పేరు

a. విద్యార్థి పేరు

b. తరగతి-సెక్షన్

c. మీడియం

d. క్రమ సంఖ్య

2. సమాచార సేకరణ విధం

3. నివేదిక

4. ముగింపు




__________________



సంగ్రహణాత్మక మూల్యాంకనం (Summative Aassessment)


80 మార్కులు

పేపర్ 1 - 40  మార్కులు - సమయం 2.45 గం.

పేపర్ 2 - 40  మార్కులు - సమయం 2.45 గం.


పేపర్ 1

ప్రశ్నాపత్రం చదవడానికి మొదటి 15 ని.

పార్ట్ ఎ 30 మార్కులు సమయం 2:00 గం.

పార్ట్ బి 10 మార్కులు సమయం 0:30 ని.


పేపర్ 2

ప్రశ్నాపత్రం చదవడానికి మొదటి 15 ని.

పార్ట్ ఎ 30 మార్కులు సమయం 2:00 గం.

పార్ట్ బి 10 మార్కులు సమయం 0:30 ని.


*పార్ట్ ఎ లోని ప్రశ్నలకు సమాధానాలు రాసే సమయం మరియు మార్కులు

పార్ట్ ఎ - మార్కులు 30 - సమయం 2:00 గం. - అంటే 120 ని. - 120/30=4 అనగా

4నిమిషాలకు           1మార్కు

8నిమిషాలకు           2మార్కులు

12నిమిషాలకు          3మార్కులు

16నిమిషాలకు           4మార్కులు

20నిమిషాలకు 5మార్కులు

24నిమిషాలకు 6మార్కులు

(సులభంగా సమాధానం రాయగల ప్రశ్నలను ముందుగా ఎంచుకుని జవాబు రాసి, సమయం మిగుల్చుకుని కఠినమైన  ప్రశ్నలకు ఆలోచించి జవాబులు రాయాలి. రాయాల్సిన అన్ని ప్రశ్నకు జవాబు రాసే ప్రయత్నం చేయాలి.)


పేపర్ 1

మార్కులు 40 - సమయం 02:45 గం.

పార్ట్ ఎ

మార్కులు 30 - సమయం 2:00 గం. (ఇందులో రెండు సెక్షన్ లు వుంటాయి)


I. వ్యక్తీకరణ - సృజనాత్మకత (స్వీయ రచన)

అ)   ఇందులో వచ్చే ప్రశ్నలకు ఐదు వ్యాక్యాలలో జవాబులు రాయాలి. 4×3=12

మార్కులు 12 ....    4×3=12  -  సమయం: 48నిమిషాలలో పూర్తిచేయాలి.

ఇందులో 1-4 వరకు 4ప్రశ్నలు వుంటాయి.

ఒక్కొక్క ప్రశ్నకు 3మార్కులు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

నాలుగింటిలో రెండు ప్రశ్నలు పద్య భాగం నుండి రెండు ప్రశ్నలు గద్య భాగం నుండి వస్తాయి.

ఇందులో కవి పరిచయానికి సంబంధించి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది.   

ఆ) ఇందులో వచ్చే ప్రశ్నలకు పది వ్యాక్యాలలో జవాబులు రాయాలి.     3×6=18

మార్కులు 18 ...   3×6=18  -  సమయం: 72నిమిషాలలో పూర్తిచేయాలి.

5-7 వరకు 3 ప్రశ్నలు వుంటాయి.ప్రతి ప్రశ్న అంతర్గ అవకాశాన్ని కలిగి వుంటుంది.

ఒక్కొక్క ప్రశ్నకు 6మార్కులు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

పద్య భాగం నుండి ఒక ప్రశ్న, గద్య భాగం నుండి ఒక ప్రశ్న, ఉప వాచకం నుండి ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది.


పార్ట్ బి

II. భాషాంశాలు (పదజాలం)         మార్కులు 10  - సమయం 30ని.

ఇందులో మెత్తం ప్రశ్నలు 18

అన్ని ప్రశ్నలు పదజాలాంశముల నుండే వస్తాయి.

1,2 ప్రశ్నలు సొంత వాక్యాలు 2×1=2

3-18 వరకు 16 ప్రశ్నలు. 16× 1/2=8

అర్థాలు, పర్యాయపదాలుల, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్యర్థాలు నుండి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వుంటాయి.


పేపర్ 2

మార్కులు 40  సమయం 2:45 గం.


పార్ట్ ఎ

మార్కులు 30 - సమయం 2:00 గం. (ఇందులో రెండు సెక్షన్ లు వుంటాయి)


I. అవగాహన - ప్రతిస్పందన (చదవడం - అవగాహన చేసుకుని రాయడం)

మార్కులు 20 ...  4×5=20  -  సమయం: 80నిమిషాలలో పూర్తిచేయాలి.

అ) పరిచిత గద్యం - 5మార్కులు - సమయం: 20ని.

ఉపవాచకం నుండి కొంత గద్యం ఇవ్వబడుతుంది. గద్యం కింద ఐదు ప్రశ్నలు ఇవ్వబడతాయి వాటికి ఐదింటికి సమాధానాలు రాయాలి.

ఆ) అపరిచిత గద్యం - 5 మార్కులు - సమయం: 20ని.

తెలియని గద్యము ఇచ్చి దాని కింద ఐదు ప్రశ్నలు ఇవ్వబడతాయి.అన్నింటికీ సమాధానాలు రాయాలి.

ఇ) పరిచిత పద్యం - 5మార్కులు - సమయం: 20ని.

కంఠస్థ పద్యాలు లో నుండి ఇవ్వబడుతుంది పద్యం ఇస్తే ప్రతి పదార్థం రాయాలి లేదా పద్య పురాణం పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించాలి భావాన్ని కూడా రాయాలి.

ఇ) అపరిచిత పద్యం - 5మార్కులు - సమయం: 20ని.

తెలియని పద్యం అంటే పాఠ్యపుస్తకాలలో లేని పద్యం ఇవ్వబడుతుంది. దాదాపుగా శతక పద్యం వస్తుంది. దాని కింద ఐదు ప్రశ్నలు ఇవ్వబడతాయి. అన్నింటికీ సమాధానాలు రాయాలి.


II. వ్యక్తీకరణ - సృజనాత్మకత (సృజనాత్మకత)

మార్కులు 10 ....   2×5=10  -  సమయం: 40 నిమిషాలలో పూర్తిచేయాలి.

ఇందులో 3 ప్రశ్నలు ఇవ్వబడతాయి. రెండింటికి సమాధానాలు రాయాలి. 

ఈ సెక్షన్ కింద సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు వుంటాయి. ఉదా. సంభాషణ, లేఖా రచన, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, వ్యాసం, కరపత్రం, సన్మాన పత్రం/అభినందన పత్రం, నినాదాలు తయారు చేయడం, గేయ రచన, వర్ణన మొదలైనవి. 


పార్ట్ బి

III. భాషాంశాలు (వ్యాకరణం)           మార్కులు 10 - సమయం 30ని.

వ్యాకరణాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.

సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు, కర్తరి కర్మణి వాక్యాలు, సామాన్య సంయుక్త  సంశ్లిష్ట వాక్యాలు మరియు ప్రాచీనం నుండి ఆధునిక వచనంలోకి మార్చడం లాంటి విభాగాల నుండి ప్రశ్నలుంటాయి.





__________________

తెలుగులో 10/10 సాధించడం చాలా సులభం

ఆంగ్ల మాధ్యమ బోధనా ప్రభావం వల్ల ఐతేనేమి, ప్రస్తుత ఉపాధి అవకాశాల వల్ల తల్లిదండ్రుల ఎంపిక ఐతేనేమి తెలుగు భాషకి  విద్యావ్యవస్థలో ఆదరణ తగ్గింది అనడం సబబే. మాతృభాషలో రానించలేనివారు మిగతా సబ్జెక్టు లలో పరిపూర్ణతని సాధించలేరనేది కూడా నిజమే.  కావున మాతృభాషను ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకండి.

మిగతా సబ్జెక్టుల మాదిరిగా తెలుగులో
10వ తరగతి విద్యార్థులు తెలుగులో 10/10 సాధించడం కష్టమే 
కానీ పైన వివరించిన విధంగా క్రమపద్దతితో చదివితే 
తెలుగులో 10/10 సాధించడం చాలా సులభం


 వివరించిన మూడు విభాగాలలోని అంశాలు చదువుకొనుటకు వీలుగా ఒకే చోట పిడిఎఫ్ రూపంలో






All the Best to All

By....... Rajendra, 6302324734(WhatsApp Only)





0/Post a Comment/Comments