రంగు రంగుల సీతా కోక చిలుక
గొంగళి రూపు లోని వర్ణ కర్ణిక
ఈ రంగులు అందాల రంగవల్లి
విరి లోని మకరంద్రము గ్రోలే
మధు మతివి
పూతోటకు మహారాణి.వి...
రంగురంగుల పూల మధువుతో
వన్నెల చిన్నెల చిరు మయూరి లా అలవోకగా
ఎగురుతూ ఝుం ఝంనాదం...తో
పూలపై వాలుతుంటే నీ నాదంసంగీతమై
కీటక కోకిలగా మమ్ము అలరిస్తున్నావు
.. చిరు రెక్కల సోయగం చూడతరమా..
అసహ్యించుకునే గొంగళి పురుగు...
అందమైన సీతాకోకచిలుక లా మార్పు చెందడం మే
మానవ జీవితానికి అందమైన సవాల్ సృష్టి వి చిత్రానికి నీవే సాక్ష్యం ...
సీతాకోక చిలుకలులాంటిఅమ్మాయిలకు
పోలిక.. గొంగళి పురుగులు లాంటివి కష్టనష్టాలను తట్టుకుని
అందమైన సీతాకోకచిలుక ల రూపు చెందేది మగువ.....
అవని కే అందమైన సీతాకోకచిలుక....
శ్రీమతి సత్య మొం డ్రేటి
హైదరాబాద్