సామజవరగమన..
సామజవరగమన …. అక్షరక్రమ కవిత
** నా తెలుగు **
"సా"హిత్యానికి పురుడు పోసి..
"మ"హానుభావులు కలానికి పదును పెట్టి..
"జ"నుల గుండెల్ని దోచుకొనేలా..
"వ"ర్ణమాలను సృష్టించి..
"రం"గ స్థలంపై పరిచయం చేసి..
"గ"గన వీధుల్లో విహారిస్తూ..
"మ"న" సమాజానికి వెన్నుంటూ..
"సా"హిత్యాన్ని అభివృద్ది పథంలోకి అడుగులు వేపిస్తూ..
"మ"నందరిలో ఐక్యమై..
"జ"న సంచారం చేస్తూన్న..
"వ"ర్ణ సువర్ణాలతో, ముస్తాబుగా,ఎంతో అందంగా..
"రంగరించి..,సింగారించిన మన తెలుగు భాష..
"గ"గణమై..మేఘ సందేశమై..
"మ"న మదిలో అద్భుతంగా నిలిచిపోయిన..మన భాష..
"న"దిలా ప్రవహిస్తూ.. చెవులకు వినసొంపుగా వినే అమ్రుత గానంలా "సామజవరగమన".. "సామజవరగమన".. అంటూ
సృష్టి అంతమయ్యె వరకు నిలిచిపోతుంది నా తెలుగు!
పేరు: పుల్లూరి సాయిప్రియ
కలం పేరు: ప్రియ సరస్వతి
ఊరు: చౌడారం , మం: చిన్నకోడూరు
జిల్లా: సిద్దిపేట, తెలంగాణ